‘స్థానిక’ రిజర్వేషన్లపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ రిజర్వేషన్లపై సమీక్ష

Oct 12 2026 8:22 AM | Updated on Oct 12 2026 8:22 AM

‘స్థానిక’ రిజర్వేషన్లపై సమీక్ష ఎన్నికల సామగ్రి సరఫరా అఖిల భారత ట్రెక్కింగ్‌ క్యాంపునకు రాజేష్‌ నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్‌ సత్ప్రవర్తనతో మెలగాలి శ్రీనివాసా.. గోవిందా

భీమవరం(ప్రకాశంచౌక్‌): స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం, పారదర్శకంగా నిర్వహించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ వీఆర్‌ కృష్ణతేజ ఆదేశించారు. ఆదివారం తాడేపల్లి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన అధికారులకు మార్గదర్శకాలు, సూచనలు జారీ చేశారు. భీమవరం కలెక్టరేట్‌ నుంచి జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వై.దోసిరెడ్డి, భీమవరం, నరసాపురం ఆర్డీఓలు దాసిరాజు, ప్రవీణ్‌కుమార్‌, జెడ్పీ సీఈఓ డి.రమణ, ఎంపీడీఓలు తదితరులు హాజరయ్యారు. రిజర్వేషన్ల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను రచ్చితంగా పాటిస్తూ నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని కృష్ణతేజ సూచించారు.

ఆకివీడు : ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం సామగ్రి సరఫరా కొనసాగుతోంది. ఆదివారం ఎన్నికల కోసం అవసమయ్యే కాగితాల్ని సరఫరా చేయడంతో అవి కార్యాలయానికి చేరుకున్నాయి. సిబ్బంది వాటిని భద్రపరిచారు. ఇటీవల బ్యాలెట్‌ బాక్సులు సరఫరా అయిన విషయం తెలిసిందే. ఎన్నికల నోటిఫికేషన్‌ రెండు, మూడు రోజుల్లో వస్తుందని అంచనా వేస్తున్నారు. నోటిఫికేషన్‌ వచ్చేసరికే సామగ్రి అందుబాటులో ఉంచాలని, కేంద్రాలు తదితర వాటిని పర్యవేక్షిస్తున్నారు.

భీమవరం: నాగాలాండ్‌లోని వోఖాలో నిర్వ హించే ఎన్‌ఈఆర్‌ ట్రెక్కింగ్‌ క్యాంపునకు భీమవరం డీఎన్నార్‌ కళాశాల సీనియర్‌ డివిజన్‌ ఎన్‌సీసీ క్యాడెట్‌ కోల రాజేష్‌ ఎంపికై నట్టు ప్రిన్సిపల్‌ బీవీ నర్సింహరాజు తెలిపారు. ఈనెల 17 నుంచి 24 వరకు జరిగే క్యాంపులో రాజేష్‌ పాల్గొంటాడన్నారు.రాజేష్‌ను కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకటనర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు, ఎన్‌సీపీ ఆఫీసర్‌ ఎ.వీరయ్య అభినందించారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్‌ కేంద్రాల్లో సోమ వారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. అలాగే రెవెన్యూ క్లినిక్‌ కూడా నిర్వహిస్తామన్నారు. ఆన్‌లైన్‌, టోల్‌ఫ్రీ 1100 ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు.

భీమవరం: రౌడీషీటర్స్‌ వివాదాల్లో తలదూర్చకుండా సత్ప్రవర్తతో మెలగాలని భీమవరం వన్‌టౌన్‌ సీఐ ఎ.రమేష్‌ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆదివారం వన్‌టౌన్‌ స్టేషన్‌లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇప్పటికే వివాదాల్లో ఉండటం వల్ల రౌడీషీట్స్‌ ఓపెన్‌ చేసిన నేపథ్యంలో ఎన్నికల్లో వివాదాలకు దూరంగా ఉండకపోతే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అనంతరం స్థానిక బస్టాండ్‌లో మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. ఎస్సై చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

ద్వారకాతిరుమల: దసరా సెలవుల నేపథ్యంలో ద్వారకాతిరుమల క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వేలాది మంది భక్తులు స్వా మివారి దర్శనానికి తరలిరావడంతో ఆలయ పరిసరాలు జనసంద్రమయ్యాయి. దర్శన క్యూలైన్లతోపాటు ఉచిత ప్రసాదం పంపిణీ కేంద్రం, అన్నదాన విభాగం భక్తులతో రద్దీగా కనిపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు క్షేత్రంలో భక్తుల సందడి కొనసాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement