పెదవేగి : స్థానిక అంబేడ్కర్ గురుకుల కళాశాలలో జరుగుతున్న 70వ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ సాఫ్ట్‌బాల్ అండర్–19 పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఆదివారం పోటీలు క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్నాయని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్కూల్‌గేమ్స్ సెక్రటరీ కందికొండ జయరాజ్ తెలిపారు. బాలికల విభాగంలో గుంటూరు జట్టు విజయనగరం జట్టుపై 5–0, కడప జట్టు శ్రీకాకుళం జట్టుపై 30–21, తూర్పుగోదావరి జట్టు పశ్చిమగోదావరిపై 13–2, నెల్లూరు జట్టు అనంతపురంపై 7–5 స్కోరుతో గెలిచి సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయన్నాయన్నారు. అలాగే బాలురు విభాగంలో విజయనగరం, అనంతపురం, పశ్చిమగోదావరి, విశాఖ, గుంటూరు, కడప, నెల్లూరు, కృష్ణా జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకోగా.. విజయనగరం జట్టు అనంతపురం జట్టుపై 6–2, పశ్చిమగోదావరి జట్టు విశాఖపై 6–0 స్కోరుతో గెలిచి సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయన్నారు. మిగిలిన నాకౌట్ మ్యాచ్‌లు సోమవారం నిర్వహించనున్నారు.


