యూసీజీ ప్రాజెక్టును అడ్డుకుంటాం | - | Sakshi
Sakshi News home page

యూసీజీ ప్రాజెక్టును అడ్డుకుంటాం

Oct 12 2026 8:22 AM | Updated on Oct 12 2026 8:22 AM

చింతలపూడి: అండర్‌ గ్రౌండ్‌ కోల్‌ గ్యాసిఫికేషన్‌ (యూసీజీ) ప్రాజెక్టు పనులను సాగనివ్వబోమని, ప్రాణాలర్పించైనా అడ్డుకుని తీరుతామని రేచర్ల గ్రామ బాధిత రైతులు, ప్రజలు ఆదివారం ముక్తకంఠంతో ప్రతిజ్ఞ చేశారు. గ్రామస్తులతో కలిసి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి దొంతా కృష్ణ మాట్లాడుతూ చట్టాలను, నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రైతుల శ్రేయస్సును విస్మరించి కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాయడం దారుణమన్నారు. గతంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే, చింతలపూడి ఎత్తిపోతల పథకాల కోసం ప్రభుత్వం భూములు అడిగినప్పుడు, మార్కెట్‌ ధర కంటే తక్కువ పరిహారం ఇచ్చినా ప్రజాప్రయోజనాల దృష్ట్యా రైతులు భూములిచ్చారని గుర్తుచేశారు. ఆ త్యాగాలను గుర్తించకుండా మళ్లీ ఇప్పుడు యూసీజీ ప్రాజెక్టు పేరుతో తమ పొట్టకొట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదన్నారు. రైతుల బతుకుల్లో నిప్పులు పోసే ఈ విధ్వంసకర ప్రాజెక్టును ప్రాణాలొడ్డైనా ని లువరించి తీరుతామని స్పష్టం చేశారు. రేచర్ల యూ సీజీ ప్రాజెక్ట్‌ కమిటీ కన్వీనర్‌ చిక్కాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభావిత ప్రాంత ప్రజల అభిప్రాయాలను కనీసం పరిగణనలోకి తీసుకోకుండా, ప్ర జాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ఈ ప్రాజెక్టును రిలయన్స్‌ సంస్థకు ఎలా అప్పగిస్తారని నిలదీశారు. ప్రజలను విస్మరించి నిర్ణయాలు తీసుకుంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కె.శివరామకృష్ణ, కంచర్ల శ్రీనివాసరావు, కొమ్మిన రాంబాబు, కొమ్మిన వెంకటేశ్వరరావు, గొల్లపూడి సర్వ య్యలతో పాటు బాధిత రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement