స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం

Oct 12 2026 8:22 AM | Updated on Oct 12 2026 8:22 AM

వీరవాసరం: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌, భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకట్రాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం వీరవాసరంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వారు పాల్గొన్నారు. చినమిల్లి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించిన ఏకై క పార్టీ వైఎస్సార్‌సీపీ అన్నారు. కూటమి ప్రభుత్వ నాయకులు ఎన్ని ఆటంకాలు, అవరోధాలు సృష్టించినా రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడే నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ కొండంత అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు.

కుట్రలను ఎదుర్కొందాం

ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ శెట్టిబలిజ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కవురు శ్రీనివాస్‌ మాట్లాడుతూ మున్సిపల్‌, కార్పొరేషన్‌, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకెళితే విజయం సునాయాసం అ న్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఓటు వేసి గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే కూటమి నాయకుల కుట్రలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వైఎస్‌ జగన్‌ పాలనలో అందించిన సంక్షేమ పథకాలు, చేసిన మేలును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం నాయకులకు, కార్యకర్తలకు పార్టీ ఐడీ కార్డులను అందజేశారు. మండల కన్వీనర్‌ చవాకుల సత్యనారాయణమూర్తి, మాజీ మండల కన్వీనర్‌ నేతల జ్ఞాన సుందరరాజు, మాజీ జెడ్పీటీసీ మానుకొండ ప్రదీప్‌కుమార్‌, వీరవాసరం పట్టణ అధ్యక్షుడు గుబ్బల శ్రీనివాస్‌, రాష్ట్ర నాయకులు వీరవల్లి రాధాకృష్ణ, ఎరకరాజు ఉమాశంకర్‌ రాజు, చిగురుపాటి సందీప్‌, పిల్లి వీరేశ్వరరావు, డీవీడీ ప్రసాద్‌, కడలి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement