● ఎన్నికల్లో బీఎల్‌ఏలే కీలకం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు
తాడేపల్లిగూడెం : నవరత్నాల ఽపథకాలతో ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్య మంత్రిగా చూసేవరకూ ఎవరూ విశ్రమించవద్దని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు పిలుపునిచ్చారు. స్థానిక గమిని ఫంక్షన్ ప్లాజాలో గురువారం నియోజకవర్గ కన్వీనర్ వడ్డి రఘురాం అధ్యక్షతన తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీఎల్‌ఏల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రసాదరాజు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఏ)దే ప్రముఖ పాత్ర అన్నారు. ఆయా బూత్‌ల పరిధిలో ఉన్న ఓటర్లు, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన ఓటర్ల వివరాలు, డబుల్ ఎంట్రీలుంటే ఆధారాలతో బీఎల్‌ఓ వద్ద నిరూపించి రెండు ఓట్లలో ఒక ఓటును తొలగించేలా చూడాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఒక బూత్ పరిధిలో 1,500 ఓట్లు ఉన్నప్పుడు వీటిని విభజించే సమయంలో మిగిలిన ఓట్లు దూరప్రాంతాల బూత్‌లకు మార్చకుండా, పక్క బూత్‌లోకి వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్రియాశీలక పాత్ర పోషించేది బూత్ లెవెల్ ఏజెంట్లని, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక వీరికి నూరు శాతం ప్రాధాన్యత ఇచ్చి సముచిత స్థానం జగన్ కల్పిస్తారని ప్రసాదరాజు అన్నారు. ఈ మూడేళ్లు పార్టీ శ్రేణులు మిక్కిలి జాగ్రత్తగా ఉంటూ, జరిగే పరిణామాలను గమనిస్తూ ఉండాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు.
ఓట్లు తొలగించకుండా చూడాలి
పోలింగ్ బూత్‌ల్లో ఓట్లు తొలగించే కుట్రలుంటే వాటిని విజయవంతంగా నిలువరించాలని నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి ము రళీకృష్ణంరాజు అన్నారు. వైఎస్సార్‌సీపీతోనే ప్రజలకు భవిష్యత్ అని, ప్రతి ఓటును కాపాడు కో వాలని పిలుపునిచ్చారు. పార్లమెంటరీ పరిధిలో అ న్ని కార్యకలాపాల్లో గూడెం నియోజకవర్గం అగ్రగా మి అని, ఇక్కడ కార్యకర్తలకు పెద్దపీట వేశారన్నా రు. ఐడీ కార్డుల విషయంలో తొలిస్థానంలో ఉందని, వడ్డి రఘురాం నాయకత్వంలో వేగంగా పార్టీ అభివృద్ధి చెందిందన్నారు.
ప్రతి కార్యకర్తకు గుర్తింపు
వైఎస్సార్‌సీపీలో ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉందని నరసాపురం పార్లమెంట్ ఇన్‌చార్జి గూడూరి ఉమాబాల అన్నారు. ఓట్ల విషయంలో బీఎల్‌ఏలు క్రియాశీలకంగా ఉండాలన్నారు. బీఎల్‌ఏల విధు లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పార్టీ అధికార ప్రతినిధి యనమల నాగార్జునయాదవ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎంపీపీ పొనుకుమాటి శేషులత, జెడ్పీటీసీ వరలక్ష్మి, పట్టణ అధ్యక్షుడు గొర్రెల శ్రీనివాసు, మండలాల అధ్యక్షులు చిట్టూరి బాపన్న, కై గాల శ్రీనివాసు, నాయకులు గుండుబోగుల నాగు, గుండుమోగుల బలుసులు, వీర్ల గోవిందు, మార్లపూడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


