కూటమికి వణుకు | - | Sakshi
Sakshi News home page

కూటమికి వణుకు

May 29 2026 8:04 AM | Updated on May 29 2026 8:04 AM

కూటమికి వణుకు ●

కూటమి ప్రభుత్వం దడావణుకుతో బతుకుతోంది. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక, మోసపూరితంగా వ్యవహరిస్తోంది. కూటమిలో మూడు పార్టీల కార్యకర్తలకు ఒక్క వైఎస్సార్‌సీపీ కార్యకర్త సమానం, వీరిని చూసి కూటమి నాయకులు భయపడుతున్నారు. నియోజకవర్గంలో బీఎల్‌ఏల కోసం పదవీ విరమణ చేసిన తహసీల్దార్‌ లేదా ఉపాధ్యాయుల నేతృత్వంలో ఒక వార్‌ రూమ్‌ ఏర్పాటుచేస్తాం. సహాయం కోసం 15 మంది సిద్ధంగా ఉంటారు. పశ్చిమబెంగాల్‌, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఏం జరిగిందో చూశాం. ఈ పరిస్థితి ఇక్కడ రాకూడదు. బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా నాకు కన్వీనర్‌ పదవి వచ్చింది. వైఎస్సార్‌సీపీలో కష్టించే వారికి గుర్తింపు ఎప్పుడు ఉంటుంది. నేను కనుక ఎమ్మెల్యేగా గెలిస్తే అది పార్టీ శ్రేణులు పెట్టిన భిక్ష. మన హక్కుల కోసం ప్రతి బీఎల్‌ఏ సైనికుడి మాదిరి కష్టపడాలి. మోదీ తర్వాత దేశంలో ఆదరణ కలిగిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి. నియోజకవర్గంలో 209 మంది బీఎల్‌లకు ప్రాధాన్యముంది. అందరూ కష్టపడి పనిచేద్దాం.

– వడ్డి రఘురాం, తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్‌

Advertisement
 
Advertisement
Advertisement