నూరు శాతం లక్ష్యాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

నూరు శాతం లక్ష్యాలు సాధించాలి

May 28 2026 3:04 AM | Updated on May 28 2026 3:04 AM

నూరు శాతం లక్ష్యాలు సాధించాలి 425 మి.మీ. వర్షపాతం ఏపీటీఎఫ్‌ జిల్లా కమిటీ ఎన్నిక కొనసాగిన మట్టి పరీక్షలు వడదెబ్బతో మహిళ మృతి

భీమవరం : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను నిర్దేశిత లక్ష్యాల మేరకు నూరు శా తం సాధించాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బడి పిలుస్తోంది కార్యక్రమంపై సమీక్షించారు. మండల ప్రత్యేక అధికారులు శ్రద్ధ చూపాలని, గతేడాది కంటే 10 శాతం అధికంగా విద్యార్థుల చేరికలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలంలో ఐదేళ్లు పైబడిన పిల్లల్లో కనీసం 55 శాతం మంది 1వ తరగతిలో చేరేలా చూడాలని తెలిపారు. డీఈఓ ఈ.నారాయణ, సమగ్ర శిక్ష ఏపీసీ పి.శ్యాంసుందర్‌, మండల ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

భీమవరం : జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి 425 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా యలమంచిలి మండలంలో 80.4 మి.మీ వర్షం కురిసింది. తణుకులో 2.4, భీమవరంలో 8.6, నరసాపురంలో 65.6, పాలకొల్లులో 60.2, అత్తిలిలో 3.2, గణపవరంలో 2.8, పాలకోడేరులో 36.4, పెనుమంట్రలో 22.6, ఇరగవరంలో 10.6, పెనుగొండలో 2.8, ఆచంటలో 15.2, పోడూరులో 26.2, వీరవాసరంలో 50, మొగల్తూరులో 38.2 మి.మీ వర్షపాతం నమోదైంది.

భీమవరం : ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (1938) జిల్లా కమిటీని స్థానిక పొట్టి శ్రీరాములు బాలికల మున్సిపల్‌ హైస్కూల్‌లో బుధవారం ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా బి.దుర్గాప్రసాద్‌, జిల్లా అధ్యక్షుడిగా పీవీఎస్‌ఎస్‌బీ రమణారావు, ప్రధాన కార్యదర్శిగా ఎం.హరికృష్ణ, అసోసియేట్‌ అధ్యక్షుడిగా పి.నాగరాజు, అదనపు కార్యదర్శిగా వే మూరి శ్రీవల్లి, ఉపాధ్యక్షులుగా టి.ఆనంద్‌ప్రసాద్‌, ఏఎన్‌వీ సుభాషిణి, కె.గంగరాజు, పి. రాజేశ్వరరావు, జిల్లా కార్యదర్శులుగా కొల్లాబత్తుల జాన్‌ మోజెస్‌, బి.పుణ్యవతి, డి.తిరుమలేశ్వరి, వి.దుర్గ, సీహెచ్‌ఎన్‌ఆర్‌ఎల్‌ కుమారి, ఎ.అన్నపూర్ణ, జి.వెంకటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిలర్‌గా పీవీఎస్‌ఎస్‌బీ రమణారావును ఎన్ను కున్నారు. ఎన్నికలకు అధికారిగా రాష్ట్ర కార్యదర్శి ఎ.ఉదయ బ్రహ్మం వ్యవహరించారు. నూతన జిల్లా కౌన్సిల్‌ ప్రమాణ స్వీకారం అనంతరం జిల్లా అధ్యక్షులు రమణారావు మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిషన్‌ వేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.

పోలవరం రూరల్‌ : పోలవరం ప్రాజెక్ట్‌లో కేంద్ర మట్టి, పదార్థాల పరిశోధనా సంస్థ (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) బృందం బుధవారం రెండో రోజు పరీక్షలు నిర్వహించింది. గురువారం కూడా పరీక్షలు కొనసాగనున్నాయి. బృంద నిపుణు లు సిద్దార్థ్‌ పి.హెడవూ, శ్రీహరి టి.నాయర్‌, గౌరవ్‌ పాండే గ్యాప్‌–2 ప్రాంతంలో 14 పరీక్ష లు నిర్వహించారు. గ్యాప్‌–2లో వాడిన మట్టి లో తేమ శాతం, పటుత్వం, రాతిని పరిశీలించా రు. వీరి వెంట జలవనరుల శాఖ డీఈలు డి.శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, విజయ్‌కుమార్‌, ఎంఈఐ ఎల్‌ ప్రాజెక్ట్‌ జీఎం ఎ.గంగాధర్‌, డీజీఎంలు మురళి పమ్మి, గుట్టపాటి శంకరయ్య ఉన్నారు.

చింతలపూడి: చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని బోయగూ డెం గ్రామానికి చెందిన మాతవరపు నాగమణి (50) అనే మహిళ వడదెబ్బకు గురై మృతి చెందింది. మంగళవారం సాయంత్రం నాగమణి ఎండ తీవ్రత తట్టుకోలేక ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. కుటుంబ సభ్యులు ఆమెకు ఉపశమనం కలిగించే ప్రయత్నం చేసినా పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూసింది.

ఎం.హరికృష్ణ

పి.రమణారావు

Advertisement
 
Advertisement
Advertisement