ప్రతిష్టాత్మకంగా శాశ్వత క్యూ కాంప్లెక్స్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రతిష్టాత్మకంగా శాశ్వత క్యూ కాంప్లెక్స్‌

May 28 2026 3:04 AM | Updated on May 28 2026 3:04 AM

ద్వారకాతిరుమల: రాష్ట్రంలో పెద్ద తిరుపతిలో మా త్రమే ఉన్న శాశ్వత క్యూ కాంప్లెక్స్‌ను.. ఇప్పుడు చిన్న తిరుపతిలో సౌకర్యవంతంగా నిర్మించి, భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చామని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. శ్రీవారి దివ్య క్షేత్రంలో రూ.12.50 కోట్లతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్‌ను బుధవారం నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఈఓ త్రినాథరావు విలేకరులతో మాట్లాడుతూ పెద్ద తిరుపతిలో మినహా ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఆలయంలోనూ శాశ్వత క్యూ కాంప్లెక్స్‌ లేదన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలన్న లక్ష్యంతో ప్ర తిష్టాత్మకంగా నిర్మించి, భక్తులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. శాశ్వత క్యూ కాంప్లెక్స్‌లో ఒకేసారి 4,500 మంది భక్తులు కూర్చోవచ్చని చెప్పారు. అత్యవసర పరిస్థితుల సమయంలో వినియోగించేలా ఎగ్జిట్‌ గేట్లు ఏర్పాటు చేశామని, నిరంతరాయంగా భక్తులకు మంచి నీటిని అందిస్తున్నా మన్నారు. క్యూ కాంప్లెక్స్‌ నుంచి ఆలయంలోకి వెళ్లిన భక్తులు శ్రీవారి దర్శనానంతరం తిరిగి బయటకు వెళ్లి, అక్కడ ఉచిత ప్రసాదాన్ని అందుకుంటున్నారన్నారు.

శాస్త్రబద్ధంగానే ఏర్పాట్లు

శ్రీవారి ఆలయంలో నూతన వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, ఇతర కట్టడాలు, దర్శన ఏర్పాట్లు పూర్వ ఆచారాలు, సనాతన సాంప్రదాయాల ప్రకారమే జరిగాయని ఆలయ ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు తెలిపారు. ఆలయ చైర్మన్‌ సుధాకరరావు, ఈఓ త్రినాథరావు, ఈఈ భాస్కర్‌ల చొరవ కా రణంగా అనేక శాశ్వత నిర్మాణాలు జరిగాయ న్నారు. అనివెట్టి మండపంతో శ్రీవారి కల్యాణ్యాన్ని వైభవంగా నిర్వహించగలుగుతున్నామని, వివాహాలు జరుపుకునే వారికి సైతం ఈ మండపాలు ఉపయోగపడుతున్నాయన్నారు. దీంతో అనివెట్టి మండపం ఫేజ్‌–2 నిర్మాణాన్ని జరిపారన్నారు. నూతన క్యూ కాంప్లెక్స్‌, దానికి సంబంధించిన క్యూలైన్లు శాస్త్రానికి అభ్యంతరం లేకుండా ఉన్నాయన్నారు. విలేకరుల సమావేశంలో ఈఈ డీవీ భాస్కర్‌, ఏఈఓలు ఎం.దుర్గారావు, పి.నటరాజా రావు, రమణరాజు, ఉమా పతి, సూపరింటెండెంట్లు ఐవీ రామారావు, కె.కిషోర్‌, జి.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

చిన వెంకన్న ఆలయ ఈఓ త్రినాథరావు

Advertisement
 
Advertisement
Advertisement