జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం 8 గదులతో శ్రీ రామ సదనం పేరుతో నిర్మించనున్న విశ్రాంతి భవనానికి భారీ విరాళం అందించారు. జంగారెడ్డిగూడెంకు చెందిన అబ్బిన దత్తాత్రేయ, సత్యవతి దంపతులు తమ కుమారుడు అబ్బిన సునీల్ కుమార్, కోడలు మనోరమ తరఫున ఒక గదికి అయ్యే ఖర్చు రూ. 9,99,999 బుధవారం అందజేశారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ ఆర్.వి. చందనకు ఆలయ కార్యాలయంలో చెక్కు రూపంలో ఈ సొమ్మును అందజేశారు.
మండవల్లి: మండలంలోని చావలిపాడులో రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. రాచపట్నం గ్రామానికి చెందిన అందుగల పరసయ్య (50) పోలుకొండలో రొయ్యల చెరువుపై సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం 5 గంటలకు పరసయ్య తన బైక్‌పై ఇంటి నుంచి పనికి బయలుదేరాడు. చావలిపాడు కాలనీ రోడ్డులో వెళ్తుండగా, ఉదయం 5:40 గంటల సమయంలో వెనుక నుండి వచ్చిన ట్రాక్టర్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పరసయ్య రోడ్డుపై పడిపోగా, ట్రాక్టర్ వెనుక చక్రం అతని వీపుపై నుంచి వెళ్ళడంతో తీవ్ర గాయాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి భార్య సుధారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తెలికిచర్లలో బుధవారం ఉదయం పామాయిల్ తోటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తాడేపల్లిగూడెం అగ్నిమాపక అధికారి కేవీ మురళీ కొండబాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పామ్ ఆయిల్ చెట్లు కాలిపోతున్నాయన్న సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది త్వరితగతని వెళ్ళి మంటలను అదుపు చేసినట్లు వెల్లడించారు. రైతులకు, పరిసరాల ప్రజలకు అగ్నిప్రమాదాలపై తీసుకువాల్సిన జాగ్రత్తలు గురించి వెల్లడించినట్లు వివరించారు.
భీమవరం: భీమవరం పట్టణం సిగిడీల పేటలో లోఓల్టేజ్ విద్యుత్ సమస్య ఉండడంతో అక్కడికి వెళ్లిన విద్యుత్‌శాఖ ఉద్యోగులు ఆకులు సతీష్, ఎ.సునీతను స్థానికులు కొట్టడంతో కేసు నమోదుచేసినట్లు భీమవరం వన్‌టౌన్ సీఐ ఎ రమేష్ చెప్పారు. సిగిడీల పేటలో లోఓల్టేజ్ సమస్య ఉందంటూ స్ధానికులు పీజేఆర్‌ఎస్‌లో పిర్యాదుచేశారు. పరిశీలించడానికి బుధవారం వెళ్లగా వీర సూర్యచంద్రరావు, లక్ష్మణరావు గాయపర్చినట్లు సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు సీఐ చెప్పారు.
భీమవరం: భీమవరం ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో బుధవారం నిర్వహించిన దాడులలో భీమవరం పట్టణంలో గెద్దాడ రామప్రసాద్‌ను అరెస్టు చేసి అతని వద్ద ఆరు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు భీమవరం ఎకై ్సజ్ సీఐ కె బలరామరాజు బుధవారం చెప్పారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్‌ఐలు పి ఉమామహేశ్వర రావు, పి సునీల్ కుమార్‌లు పాల్గొన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని బలరామరాజు హెచ్చరించారు.


