ఎమ్మెల్యే వాటా రూ.10లు | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే వాటా రూ.10లు

May 28 2026 12:40 AM | Updated on May 28 2026 12:40 AM

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న మందుబాబుల మాటలు

త ణుకు మండలం వేల్పూరు మద్యం దుకాణం వద్ద చర్చ

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఇలాకా వేల్పూరు గ్రామంలో మద్యం మాఫియా మందుబాబులకు చుక్కలు చూపిస్తుంది. క్వార్టర్‌ బాటిల్‌పై అదనంగా రూ.30 తీసుకుంటూ జేబులు గుల్ల చేస్తుంది. క్వార్టర్‌పై అదనంగా వసూలు చేస్తున్న సొమ్ములో మా ఎమ్మెల్యేకు బాటిల్‌కు రూ.10 ఇవ్వాలంటూ మందుబాబులు చర్చించుకోవడం తణుకులో సంచలనంగా మారింది. మందుబాబులు చెబుతున్న మాటల తాలూకా వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో తణుకులో మద్యం అమ్మకాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వైరల్‌ అవుతున్న వీడియోలో రూ.99 మద్యం బాటిల్‌ రూ.130కు అమ్ముతున్నారని, రూ.130 బాటిల్‌కు రూ.150 తీసుకున్నారని మందుబాబులు చెబుతున్నారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఎమ్మెల్యే నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న మద్యం దుకాణంలో ఈ తరహా విక్రయాలు జరుగుతుండడం విశేషం.

ఎమ్మారీ ధరలకే మద్యం ఎక్కడ?

ఎన్నికల హామీల్లో భాగంగా నాణ్యమైన మద్యాన్ని క్వార్టర్‌ బాటిల్‌ రూ.99 ధరకే ఇస్తామన్న చంద్రబాబు మాటలు నీటిమీద రాతలుగా మారాయని మద్యం ప్రియులు విమర్శిస్తున్నారు. రాత్రి సమయాల్లో క్వార్టర్‌ బాటిల్‌ రూ.170కు అమ్ముతున్నారని మందుబాబులు ఆరోపిస్తున్నారు. నాణ్యమైన మద్యాన్ని ఎమ్మార్పీ ధరలకు విక్రయిస్తామని చెప్పి నేడు తణుకులో అడ్డంగా దోచేస్తున్నారని ఇదెక్కడి దోపిడీ అంటూ మందుబాబులు చర్చించుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ఎకై ్సజ్‌ అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement