కంకిపాడు: మహిళ హత్య కేసులో నిందితుడిని కంకిపాడు పోలీసులు బుధవారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐ జె.మురళీకృష్ణ మీడియా సమావేశం నిర్వహించి హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఏలూరు జిల్లా కై కలూరు మండలం వింజరం గ్రామానికి చెందిన జొన్నాదుల మేరి (33), కృష్ణాజిల్లా పెడన మండలం షేరివత్తర్లపల్లి గ్రామానికి చెందిన తోకల వినోద్‌బాబు (అలియాస్ వినోద్‌కుమార్)తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. మేరి, శివకుమార్ భార్యాభర్తలు. కై కలూరులోని ఓ హోటల్‌లో మేరి పనిచేస్తున్న సమయంలో, అక్కడికి ట్రాక్టర్ నడిపే పనులకు వచ్చిన వినోద్‌బాబుతో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇటీవల వీరిద్దరూ తెన్నేరు గ్రామంలోని ఇటుకల బట్టీల వద్ద పనులకు వచ్చారు.
అనుమానంతో గొంతు నులిమి హత్య
మేరి తాను పనిచేసిన హోటల్‌లోని వంట మేసీ్త్రతో చనువుగా మాట్లాడటం వినోద్‌బాబుకు నచ్చలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ వాగ్వాదం జరిగేది. ఈ నెల 24వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో, నైట్ ప్యాంటుతో మేరి మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసి పరారయ్యాడు. మృతురాలి భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలు వినోద్‌బాబు కోసం గాలించాయి. కంకిపాడు సమీపంలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.


