● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు
● బూత్ స్థాయి ఏజెంట్లకు ‘సర్’పై అవగాహన
భీమవరం: ఎన్నికల్లో అక్రమాలు, అవకతకలతో అధికారంలోకి వస్తున్న వారికి చెక్ పెట్టడానికి వైఎస్సార్‌సీపీ బూత్‌లెవెల్ ఏజెంట్స్ ఎంతో అప్రమత్తంగా ఉండాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు స్పష్టం చేశారు. భీమవరంలో నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు అధ్యక్షతన నిర్వహించిన వైఎస్సార్‌సీపీ బూత్ లెవల్ ఏజెంట్స్ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పదేళ్లకొకసారి జరిగే ఓటర్ల జాబితా ప్రక్షాళనలో పార్టీ సానుభూతిపరులు, నాయకులు, కార్యకర్తల ఓట్లు గల్లంతు కాకుండా బూత్ లెవెల్ ఏజెంట్స్ పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. ఇటీవల ఇతర రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక ఓట్లను భారీగా తొలగించారని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ బూత్ లెవెల్ ఆఫీసర్స్‌తో కలిసి పనిచేసి పక్కా జాబితా తయారు చేయించాలన్నారు. స్థానికంగా లేనివారు, వలస వెళ్లినవారు, చనిపోయిన వారి వివరాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. నరసాపురం పార్లమెంట్ సమన్వయకర్త ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ.. ఏజెంట్స్ కష్టపడి పనిచేస్తే వైఎస్సార్‌సీపీ ఓట్లు ఎట్టిపరిస్థితుల్లోనూ తొలగించరన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో జరిగిన సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలు తిరిగి వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని, అనుకూల ఓట్లను వేయించుకునే బాధ్యత మనపైనే ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వై.నాగార్జున యాదవ్, ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శి పడాల కిశోర్‌రెడ్డి ఏజెంట్స్‌కు శ్రీసర్‌శ్రీ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గూడూరి ఉమాబాల, మేడిది జాన్సన్, పేరిచర్ల విజయనర్సింహరాజు, కామన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఉండి నియోజకవర్గంలో..
కాళ్ళ: మన పార్టీ ఓట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. పెదఅమిరం పార్టీ కార్యాలయంలో ఉండి నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 నుంచి 20 ఏళ్లకు ఒకసారి ఓటర్ల జాబితా ప్రక్షాళన సర్ ప్రక్రియ చేపడుతుందని, గతంలో 2002లో ఇది జరిగిందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అధికార పార్టీలు తమకు అనుకూలంగా ఓట్లు తొలగించాయని, మనం ముందుచూపుతో లేకపోతే అదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. ప్రతి ఓటరును రిన్యూవల్ చేయించాల్సిన బాధ్యత ఏజెంట్లపై ఉందన్నారు. ఉండి నియోజకవర్గంలోని 238 పోలింగ్ బూత్‌ల ఏజెంట్లు వెరిఫికేషన్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పార్టీ అధికార ప్రతినిధి యనమల నాగార్జునయాదవ్ ఏజెంట్లకు ఓట్ల వెరిఫికేషన్‌పై అవగాహన కల్పించి, సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా బూత్‌లెవెల్ ఏజెంట్ల నియోజకవర్గ అధ్యక్షుడిగా పాలా రాధాకృష్ణతో పాటు ఆకివీడు, ఉండి, కాళ్ళ, పాలకోడేరు మండలాల కన్వీనర్లను ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, నర్సాపురం పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ గూడూరి ఉమాబాల, ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శి పడల కిశోర్‌రెడ్డి, పెన్మత్స దుర్గాప్రసాదరాజు, స్థానిక జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్‌పర్సన్, మండల కన్వీనర్లు, బూత్‌లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు.
పెద అమిరంలో ఉండి నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన కార్యక్ర మం
భీమవరంలో వైఎస్సార్‌సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లసమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు


