భీమవరం: ఇంటర్నేషనల్ పురుషుల బీచ్ వాలీబాల్ పోటీల్లో పాల్గొనే భారత్ జట్టు జిల్లాకు చెందిన బీచ్ వాలీబాల్ క్రీడాకారులు ముదునూరి రామకృష్ణంరాజు, పెన్మత్స కృష్ణ చైతన్య ఎంపికయ్యారని జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యవామ మంగళవారం భీమవరంలో విలేకర్లకు తెలిపారు. జూన్ 4 నుంచి నాలుగు రోజులపాటు చైనీస్ తైపీలో జరగనున్న టూర్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారన్నారు. పోటీలకు ఎంపికై న రామకృష్ణంరాజు, కృష్ణ చైతన్యలను సత్యవామ, కార్యదర్శి రాఘవేంద్రరావు, కోశాధికారి ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పవన్ కుమార్‌రాజు తదితరులు అభినందించారు.
భీమవరం: పది అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన పరీక్షకు కేవలం 15.55 శాతం మాత్రమే హాజరయ్యారు. 283 మంది పరీక్షకు హాజరుకావల్సివుండగా 44 మంది మాత్రమే హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ చెప్పారు. అలాగే ఏపీఓ ఎస్‌ఎస్ పరీక్షకు 89 మందికి 70 మంది హాజరయ్యారని ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు.
భీమవరం: జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియట్ డీఐఈవో జి.ప్రభాకరరావు తెలిపారు. మొదటి ఏడాది ఇంటర్ జనరల్ పరీక్షకు 1,358 మందికి 1,218 మంది హాజరుకాగా ఒకేషనల్ పరీక్షకు 525 మందికి 462 మంది హాజరయ్యారన్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్ పరీక్షకు 748 మందికి 96 మంది గైర్హాజరుకాగా.. ఓకేషనల్ పరీక్షకు 271 మందికి 240 మంది హాజరయ్యారని తెలిపారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం రెండో దశ అమలుకు సంబంధించి మంగళవారం కలెక్టర్ చాంబర్ నుంచి జిల్లా స్థాయి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లాలో 2026–27 సంవత్సరానికి సంబంధించి మొత్తం 1,05,561 మంది నిరక్షరాస్యులను గుర్తించారని, ఈ సంవత్సరం 52,781 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి నిరక్షరాస్యుడిని యాప్‌లో నమోదు చేయడమే కాకుండా, వారికి బోధించేందుకు తగిన వలంటీర్లను అనుసంధానం చేయాలన్నారు.


