తాడేపల్లిగూడెం (టీఓసీ): వేసవిలో వరిచేలకు నిప్ప పెట్టవద్దని తాడేపల్లిగూడెం ఫైర్ ఆఫీసర్ కేవీ మురళీ కొండబాబు పేర్కొన్నారు. ఉభయగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాద వివరాలను ఆయన వెల్లడించారు. నాచుగుంట, జగన్నాథపురం, జువ్వలపాలెం గ్రామాల్లో వరిచేలకు మంటలు చెలరేగగా అగ్నిమాపక సిబ్బంది వెళ్లి మంటలను అదుపు చేశారు. పూళ్ళ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలంలో చెలకలు అంటుకుని, అక్కడ ఉన్న చెట్లు కూడా కాలిపోవడంతో పాటు రైల్వే హైటెన్షన్ వైర్లు మీదకు రావడంతో అగ్నిమాపక సిబ్బంది వెళ్లి మంటలను అదుపు చేశారు.
జంగారెడ్డిగూడెం: అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న 3 మట్టి ట్రాక్టర్‌లను సీజ్ చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. సోమవారం రాత్రి మట్టి అక్రమ రవాణాపై సమాచారం అందడటంతో పుట్లగట్లగూడెం కొంగల చెరువు వద్దకు వెళ్లేసరికి ఎటువంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తుండటం గుర్తించి, 3 మట్టి ట్రాక్టర్‌లను సీజ్ చేసినట్లు చెప్పారు. తదుపరి చర్యల నిమిత్తం రెవెన్యూ శాఖకు సమాచారం ఇచ్చినట్లు ఆయన తెలిపారు.


