పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్చండి | - | Sakshi
Sakshi News home page

పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్చండి

May 25 2026 9:57 AM | Updated on May 25 2026 9:57 AM

పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్చండి శ్రీవారి క్షేత్రం.. భక్తజన సంద్రం రేపు రొయ్య రైతుల సమావేశం చెరువులు శుభ్రం రక్షణ చట్టంతోనే కౌలు రైతులకు న్యాయం

భీమవరం: ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయా లని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి పిలుపునిచ్చారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలోని దుర్గాపురం ప్రాంతంలో ఆమె ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లాలో సుమారు 1,200 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 6 వేల మందికి పైగా నిపుణులైన ఉపాధ్యాయులు ఉన్నారన్నా రు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, సామాజిక అవగాహన, లోకజ్ఞానం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. జి ల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ప్ర భుత్వ పాఠశాలల ప్రయోజనాలపై విస్తృత ప్ర చార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, డీఈఓ ఈ.నారాయణ, తహసీల్దార్‌ రావి రాంబాబు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ద్వారకాతిరుమల : చినవెంకన్న దివ్య క్షేత్రంలో ఆదివారం సైతం భక్తుల రద్దీ కొనసాగింది. వేసవి సెలవులు కావడంతో వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, అనివెట్టి మండపం, తూర్పురాజగోపుర ప్రాంతం, కల్యాణకట్ట ఇలా అన్ని విభాగాలు భక్తులతో పోటెత్తాయి. సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది.

కై కలూరు : రొయ్యల సాగు రైతుల ప్రధాన స మస్యలపై డెల్టా ఆక్వాఫార్మర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కై కలూరు సీఎన్నార్‌ గార్డెన్‌లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్టు సంఘ నాయకులు సురేష్‌, రాము ఆదివారం తెలిపారు. రొయ్యల మేతల ధరల పెంపు, డీజిల్‌ ధరలతో సమస్యలు, రొయ్య ధరల పతనం వంటి సమస్యలపై చర్చిస్తామన్నారు.

భీమడోలు : ‘గ్రామాల్లో దా హం కేకలు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. భీమ డోలు ఎంపీడీఓ సీహెచ్‌ పద్మా వతి ఆదేశాల మేరకు గుండుగొలను వింధ్యవాసిని చెరువులో పసర్లు తొలగించే పనులను పంచాయతీ అభివృద్ధి అధికారి ఎం.వెంకట్రావు చేపట్టారు. చెరువు గట్టుపై పిచ్చిమొక్కలను తొలగించారు. అలాగే వైఎస్సార్‌ కాలనీలో మంచినీటి సమస్య పరిష్కారానికి గుండుగొలను పంచాయతీ నుంచి రూ.7.2 లక్షలతో బ్రాహ్మణచెర్వు నుంచి పైపులైన్‌ నిర్మా ణం చేపడుతున్నామని ఎంపీడీఓ తెలిపారు.

దెందులూరు : కౌలు రైతుల రక్షణ కోసం నూత న కౌలు చట్టం తీసుకురావాలని, కౌలు రైతు లందరికీ అన్నదాత సుఖీభవ పెట్టుబడి సా యం వంటి పథకాలు అందించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన దెందులూరులో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కౌలు రైతులు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభు త్వం తక్షణమే కౌలు చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. కౌలు రైతులను నిర్లక్ష్యం చేస్తే ఆహార సంక్షోభం తప్పదని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement