తణుకు అర్బన్/కుక్కునూరు/దెందులూరు/జంగా రెడ్డిగూడెం: ఎండల తీవ్రతకు వడదెబ్బతో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. తణుకు తహసీల్దారు కార్యాలయం ప్రాంతంలోని సిమెంట్ బెంచ్‌పై పడుకుని ఓ వ్యక్తి ప్రాణం విడవగా స్థానికులు గుర్తించి పోలీసులకు తె లియజేశారు. మృతుడికి సుమారు 58 ఏళ్ల వయసు ఉంటుందని, కోర్టు పక్క వీధిలో మార్కెట్ వద్ద కొంతకాలంగా పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడని, వడదెబ్బకు చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నా రు. మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తెలపాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు.
కుక్కునూరులో..
వడదెబ్బతో కుక్కునూరు మండలంలో ఇద్దరు వ్య క్తులు మృతిచెందారు. తొండిపాక పంచాయతీ మె ట్టగూడెం గ్రామానికి చెందిన నోముల వంశీకృష్ణ (35) జీవనోపాధి నిమిత్తం సరిహద్దు గ్రామమైన బూర్గంపాడులో హోటల్‌లో వంట మాస్టర్‌గా విధు లు నిర్వహిస్తున్నాడు. రోజులా శనివారం విధులకు వెళ్లిన వంశీకృష్ణ అస్వస్థతకు గురై హోటల్లోనే కుప్పకూలిపోయాడు. సహచరులు అతడిని బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా వడదెబ్బ తగిలిందని నిర్ధారించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వంశీకృష్ణ శనివారం రాత్రి మృతి చెందాడు. వంశీకృష్ణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బంజరగూడెంలో 84 ఏళ్ల వృద్ధుడు
బంజరగూడెం గ్రామానికి చెందిన గవర్ల పెరుమాళ్లు (84) అనే వృద్ధుడు ఆదివారం ఉదయం వడదెబ్బకు గురై మృతి చెందాడు. పెరుమాళ్లు ఉన్నట్టుండి అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు.
పోతునూరులో..
దెందులూరు మండలం పోతునూరులో కోడెల సత్యనారాయణ (79) వడదెబ్బకు గురై మృతి చెందారు. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రతకు ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో మరో ఆస్పత్రికి తరలించేలోపు ఆయన కన్నుమూశారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రెవెన్యూ అధికారులు ఘటనపై వివరాలు సేకరించారు.
జంగారెడ్డిగూడెంలో..
జంగారెడ్డిగూడెం లక్ష్మీనారాయణ థియేటర్ సమీపంలోని చాపల దాసుగారి రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. సుమారు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి ఆదివారం వడదెబ్బకు గురై మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. ఎస్సై ఎన్‌వీ ప్రసాద్ ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. అతడు ఉప్పలమెట్టకు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కోడెల సత్యనారాయణ (ఫైల్)
గవర్ల పెరుమాళ్లు (ఫైల్)


