మెడికల్‌ కాలేజీతో మెరుగైన వైద్యం | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కాలేజీతో మెరుగైన వైద్యం

May 25 2026 9:57 AM | Updated on May 25 2026 9:57 AM

మెడికల్‌ కాలేజీతో మెరుగైన వైద్యం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఉండాలని సంకల్పించారు. దీనిలో భాగంగా పాలకొల్లు మండలం దగ్గులూరులో మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులు కూడా చేపట్టారు. అత్యంత మెరుగైన వైద్యం, అధునాతన పరికరాలు ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ కాలేజీ నిర్మాణం పూర్తయితే పలురకాల స్పెషలిస్టులతో పాటు అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి వస్తాయి. అత్యవసర సేవలు కూడా వేగంగా అందుతాయి. అయితే కూట మి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ కాలేజీ నిర్మాణాన్ని అటకెక్కించింది. నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, కూటమికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నా ప్రజలకు ఉత్తమ సేవలందించే వైద్య కళాశాల నిర్మాణాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. స్థానికంగా మెడికల్‌ కాలేజీని అందుబాటులోకి తీసుకువచ్చి పేదల ప్రాణాల కాపాడవచ్చనే ఆలోచనల కూడా వీరు చేయడం లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భీమవరం నుంచి కాకినాడకు దూరం 125 కి.మీ.

భీమవరం నుంచి విజయవాడకు దూరం 139 కి.మీ.

భీమవరం నుంచి గుంటూరుకు దూరం 183 కి.మీ.

Advertisement
 
Advertisement
Advertisement