ధ్యానంతో ఒత్తిడి దూరం | - | Sakshi
Sakshi News home page

ధ్యానంతో ఒత్తిడి దూరం

May 25 2026 9:57 AM | Updated on May 25 2026 9:57 AM

భీమవరం: పోలీస్‌ వృత్తిలో ఎదురయ్యే తీవ్రమైన ఒత్తిడిని నియంత్రించుకోవడానికి ధ్యానం దివ్యౌషధమని భీమవరం డీఎస్పీ రఘువీర్‌ విష్ణు, జిల్లా ఆర్మడ్‌ రిజర్వ్‌ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. జిల్లా పోలీస్‌ సిబ్బందికి మానసిక ప్రశాంతత, ఒత్తిడి నిర్వహణ కోసం ‘హార్ట్‌ఫుల్‌నెస్‌ మెడిటేషన్‌’ శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక డీఎన్నార్‌ కళాశాల ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమబద్ధమైన ధ్యాన సాధన ద్వారా ఏకాగ్రత పెరగడంతో పాటు శారీరక దృఢత్వం, మానసిక సమతుల్యత సిద్ధిస్తాయన్నారు. వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇది దోహదపడుతుందని వివరించారు. మూడు రోజుల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ డిస్ట్రిక్ట్‌ కో–ఆర్డినేటర్‌ ఆకుల స్వామి, ఆర్‌పీ కె. రాజే ష్‌బాబు, ట్రైనర్లు ఎస్‌.గాయత్రీదేవి, సీహెచ్‌ సత్యనారాయణ రాజు, జి.రవిప్రకాష్‌ ప్రత్యేక ధ్యాన తరగతులు నిర్వహించారు. శ్వాసక్రియలు, ధ్యాన ముద్రలు, వ్యాయామాలపై శాసీ్త్రయ శిక్షణ అందించారు. సీఐలు ఎ.రమేష్‌, పి.మురళీకృష్ణ, బి.శ్రీనివాసరావు, వి.శ్రీనివాసరావు, జి.కాళీచరణ్‌, ఇందుమతి, ఎస్సైలు, రిజర్వ్‌ సిబ్బంది, హోమ్‌గార్డులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement