రాష్ట్ర ప్రభుత్వం ఆక్వారైతుల సమస్యలపై సరైన నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే రైతు పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ప్రభుత్వానికి రైతుల నుంచి వచ్చే ఆదాయాన్ని రైతు కోసమే ఖర్చు చేయాలి. గతంలో చంద్రబాబు పాలకొల్లు సభలో 90 శాతం మంది ఆక్వా రైతులు నష్టపోయారని చెప్పారు. ఇప్పుడు అదే స్థితిలో ఉన్నారు.
– యడవల్లి వెంకటేశ్వరరావు, మండల జనసేనపార్టీ అధ్యక్షుడు
సిండికేట్ వ్యవస్థను రూపుమాపి ప్రభుత్వమే రొయ్యల కొనుగోలు చేపట్టాలి. లేకపోతే ఆక్వా రైతు సిండికేట్ చేతిలో బలైపోతున్నాడు. అప్పుడు ఊబిలో కూరుకుపోతున్నాడు. మేతల ధరలు తగ్గించాలని కోరినందుకే సిండికేట్లు ఆక్వా రైతులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. పట్టుబడి వచ్చినా పట్టుకుని అమ్ముకోలేని స్థితిలో ఆక్వా రైతు ఉన్నాడు.
– యువరాజు, ఆక్వా రైతు నాయకుడు, కలిగొట్ల
సిండికేట్లు, మేతల వ్యాపారులు ఐకమత్యంగా ఆక్వా రైతుల నడ్డి విరుస్తున్నారు. ఆక్వా రైతులంతా ఐకమత్యంగా కార్యాచరణ రూపొందిద్దాం. ఆక్వా రైతులను నిలువునా ముంచుతున్న సిండికేట్లకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. ప్రభుత్వం దిగివచ్చేలా అమరావతికి పాదయాత్ర చేద్దాం.
– అడబాల నాని,
వైఎస్సార్‌సీపీ నాయకుడు, ఉండి
మండలానికి ఒకటి చొప్పున కోల్డ్ స్టోరేజ్‌లు ప్రభుత్వమే నిర్మించి ఆక్వా రైతులకు అందజేయాలి. ఎందుకంటే సిండికేట్ల చేతిలో మోసపోయి సర్వం కోల్పోతున్న ఆక్వా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. సబ్సిడీ విద్యుత్‌ను కూడా వెంటనే అందజేసి ఆక్వారైతును నష్టాల ఊబి నుంచి పైకి తీసుకురావాలి.
– పూసపాటి వెంకట్రాజు, ఆక్వా రైతు, ఉండి


