ఫిర్యాదులు గడువులోగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులు గడువులోగా పరిష్కరించాలి

May 23 2026 1:46 AM | Updated on May 23 2026 1:46 AM

ఫిర్యాదులు గడువులోగా పరిష్కరించాలి ప్రశాంతంగా ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

పెనుగొండ: ప్రజా ఫిర్యాదుల వేదికలో అందిన అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఇన్‌చార్జి కలెక్టరు టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆచంట బాలం వారి పాలెం పీ4 భవనంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 170 అర్జీలను స్వీకరించారు. గత వారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో వచ్చిన అర్జీలపై ఆర్డీవో దాసిరాజు, డీపీవో వై.దోసి రెడ్డి, జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారి జి.పిచ్చయ్య సంబంధిత అధికారులతో పరిష్కారాలపై సమీక్ష నిర్వహించారు. ఆచంట నుంచి 116, పెనుమంట్ర నుంచి 17, పోడూరు నుంచి 8, పెనుగొండ నుంచి 29 ఆర్జీలు అందాయి. కార్యక్రమంలో సీపీఓ కే శివపార్వతి, డీఆర్‌డీఏ పీడీ ఎంఎస్‌ఎస్‌ వేణుగోపాల్‌, డీఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ గీతాబాయి, జిల్లా సర్వే అధికారి కే జాషువా, తదితరులు పాల్గొన్నారు.

భీమవరం: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్ష శుక్రవారం ప్రశాంతంగా జరిగినట్లు ఇంటర్‌ విద్యాశాఖ జిల్లా అధికారి జి.ప్రభాకరరావు చెప్పారు. జిల్లాలోని 41 పరీక్షా కేంద్రాల్లో ఫస్టియర్‌ పరీక్ష నిర్వహించగా జనరల్‌ పరీక్షకు 6,349 మందికి 6,057 మంది హాజరుకాగా ఒకేషనల్‌ పరీక్షకు 355 మందికి 322 మంది హాజరయ్యారన్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్‌ పరీక్షకు 2,082 మందికి 1,701 మంది, ఒకేషనల్‌ పరీక్షకు 77 మందికి 65 మంది హాజరయ్యారని ఎక్కడా మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని ప్రభాకరరావు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement