తణుకు అర్బన్: తణుకులో ఓ పొలంలో వరి కుదుళ్లకు పెట్టిన నిప్పు అతివేగంగా రాజుకుని పక్కనే ఉన్న గేదెల పాకతోపాటు ధాన్యం రాశులపైకి ఎగబాకింది.
ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎగుమతిదారులు సిండికేటుగా ఏర్పడి రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. మార్కెట్‌లోకి రొయ్యలు ఎక్కువగా వచ్చే సమయం చూసి ముందుగానే ధరలు తగ్గించేస్తున్నారు. సిండికేటు దోపిడికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పాలకొల్లులో నిరసన కార్యక్రమం చేపట్టాం. ఉదయం 9 గంటలకు పూలపల్లి వై జంక్షన్ వద్ద జరిగే కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతులు హాజరుకావాలని కోరుతున్నాం.
– గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు, జైభారత్ క్షీరారామా ఆక్వారైతు సంఘం అధ్యక్షుడు, పాలకొల్లు


