ప్రథమ చికిత్స
జాగ్రత్తలు పాటించాలి
జనసంచారం లేక వెలవెలబోతున్న భీమవరంలో ప్రకాశం చౌక్ సెంటర్
సాక్షి, భీమవరం: భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మండే ఎండలతో నిప్పులు కురిపిస్తున్నాడు. మధ్యాహ్నమయ్యే సరికి జిల్లాను నిప్పుల కొలిమిగా మార్చేస్తున్నాడు. ఉక్కపోత, ఎండ తీవ్రత, విద్యుత్ కోతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోడ్లు నిర్మానుష్యంగా మారి అప్రకటిత కర్ఫ్యూను తలపిస్తున్నాయి.
అగ్నిగుండంలా..
జిల్లాలో బుధవారం 43 డిగ్రీలకు పైబడి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రతకు తోడు వాతావరణంలో తేమశాతం పెరిగి ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అగ్నిగుండంలా ఉంటుండటంతో బయటకు రావాలంటేనే జనం హడలెత్తిపోతున్నారు. వాణిజ్య కేంద్రాలుగా పేరొందిన భీమవరంలోని జువ్వలపాలెం రోడ్డు, పీపీ రోడ్డు, తాడేపల్లిగూడెంలోని కేఎన్, తాలుకా ఆఫీస్ రోడ్లు, నరసాపురంలోని స్టీమర్ రోడ్డు, తణుకులోని వేల్పూరు రోడ్డు, రాష్ట్రపతి రోడ్డు, పాలకొల్లులోని బస్టాండ్ సెంటర్ ప్రాంతాలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. ఎండ తీవ్రతకు ఇళ్లపైన వాటర్ ట్యాంకుల్లో నీరు, గృహోపకణాలు వేడెక్కిపోతున్నాయి. వేసవితాపం నుంచి ఉపశమనం కోసం శీ తల పానీయాలను ఆశ్రయిస్తుండటంతో రోడ్ల వెంబడి చెరకు రసం, పుచ్చకాయలు, కొబ్బరిబొండా లు, జ్యూస్‌సెంటర్లు వినియోగదారులతో కిటకిటలాతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల నుంచి 30 డిగ్రీల వరకు ఉండటంతో రాత్రి పది గంటలయినా వాతావరణంగా వేడిగానే ఉంటోంది. దీనికితోడు ఏసీలు వినియోగంతో లోడ్ పెరిగి అప్రకటిత విద్యుత్ కోతలతో విలవిలలాడాల్సి వస్తోంది.
నాలుగు రోజులపాటు..
జిల్లాలో ఈనెల 24 వరకు నాలుగు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఎండ తీవ్రత దృష్ట్యా అత్యవసరమైతే తప్ప ఉద యం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బయట తి రగవద్దని అధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని, లేదంటే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
పెరిగిన ఏసీల అమ్మకాలు
జిల్లాలో స్థానిక వ్యాపారులకు చెందిన ఎలక్ట్రికల్ గృహోపకరణాల 90 వరకు ఉండగా బజాజ్, రిలయన్స్ తదితర కంపెనీలకు చెందిన షోరూమ్‌లు 30 వరకు ఉన్నాయి. మొన్నటివరకూ అంతంతమాత్రంగా ఉన్న ఏసీ, కూలర్, ఇన్వెర్టర్ల అమ్మకాలు ఎండల తీవ్రతతో కొద్దిరోజులుగా 10 నుంచి 15 శాతం మేర పెరిగి నట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గృహోపకణాలపై ఈఎంఐ సదుపాయం కల్పిస్తుండ టంతో సామాన్యులు సైతం ఏసీల వైపు మొగ్గుచూపుతున్నారు.
విపరీతమైన తలనొప్పి, తీవ్రజ్వరం, మగత నిద్ర లేదా కలవరింపులు, ఫిట్స్, పాక్షికంగా అపస్మారక స్థితి ఉంటే వడదెబ్బ లక్షణాలుగా గుర్తించి ప్రథమ చికిత్స అందించాలని వైద్యులు సూచిస్తున్నారు. చల్లని ప్రదేశానికి చేర్చి, చల్లని గు డ్డతో శరీరాన్ని తుడవడంతో పాటు చల్లని గాలి తగిలేలా చూడాలి. వీలైనంత త్వరగా సమీపంలోని ఆస్పత్రికి తరలించాలి.
ఎండలో ప్రయాణించేటప్పుడు తలకు టవల్ లేదా టోపీ కచ్చితంగా పెట్టుకోవాలి.
ఎండలో పని చేయకూడదు. మద్యం సేవించి ప్రయాణించరాదు.
త్వరగా జీర్ణమయ్యే శాఖాహారం తీసుకోవాలి
రోడ్డు పక్కన విక్రయించే రంగు నీళ్ల పానీయాలు, కూల్‌డ్రింక్స్ తీసుకోకపోవడం మంచిది. మజ్జిగ, నిమ్మరసం, బార్లీ, కొబ్బరినీళ్లు సేవించాలి.
వృద్ధులు, చిన్నారులు, గుండె, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు ఎండలో తిరగకుండా చూసుకోవాలి.


