భీమవరం: పట్టణంలో ఈనెల 12న ప్రారంభమైన ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఆఖరి రోజున ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 234 మందికి 37 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. డీఎన్నార్ అటానమస్ కళాశాలలో 200 మందికి 186 మంది హాజరు కాగా విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో 200 మందికి 178 మంది విద్యార్థులు హాజరయ్యారు.
తాడేపల్లిగూడెంలో..
తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం వా సవీ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 240 మందికి 204 మంది, మధ్యాహ్నం 240 మందికి 216 మంది హాజరయ్యారు. ప్రిన్సిపాల్ రాంబాబు, పరీక్ష కేంద్రం కో–ఆర్డినేటర్ నటరాజ్ పర్యవేక్షించారు.
ఏలూరులో..
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. అగ్రి కల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు మూడు కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం షిఫ్టుల్లో నిర్వహించిన పరీక్షలకు 739 మంది హాజరయ్యారు. ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 169 మందికి 156 మంది, మధ్యాహ్నం 168 మందికి 158 మంది, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 110 మందికి 98 మంది, మధ్యాహ్నం 110 మందికి 102 మంది, ఏలూరు సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 120 మందికి 110 మంది, మధ్యాహ్నం 120 మందికి 115 మంది హాజరయ్యారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్ సంస్థల అభివృద్ధికి సాంకేతిక ఆవిష్కరణలు కీలకమని ఇన్‌చార్జి కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భీమవరం కలెక్టరేట్‌లో బుధవారం ‘ఆవిష్కరణల ద్వారా ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌ల బలోపేతం– మేధో సంపత్తి హక్కులు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, వాణిజ్యీకరణ’ అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ వినియోగంతో ఉత్పత్తి ప్రక్రియలో సమయం, వనరుల వృథాను తగ్గించి తక్కువ వ్యయంతో అధిక నాణ్యత గల ఉత్పత్తులు తయారు చేయవచ్చని తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతిరావు మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు ప్రభుత్వం ద్వారా రుణ సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలు, సబ్సిడీలు, మార్కెటింగ్ సహా యం అందిస్తున్నట్టు చెప్పారు. విశాఖకు చెంది న ఎన్‌ఆర్‌డీసీ సైంటిస్టు, ప్రాజెక్టు హెడ్, పాలకొల్లు ఏపీ ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్ సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా ప్రజా గ్రంథాల యాల అభివృద్ధికి, పాఠకులలో పఠనాభిరుచి పెంపొందించేందుకు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఇన్‌చార్జి కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భీమవరం కలెక్టరేట్‌లో బుధవారం కంకిపాడు మండలం తెన్నేరుకి చెందిన దాత దేవినేని మధుసూదనరావు అందజేసిన పుస్తకాలను జిల్లా పరిధిలోని 31 గ్రంథాలయాలకు పంపిణీ చేశారు. మొత్తం 6 విభాగాలకు చెందిన 250 పుస్తకాలను గ్రంథాలయ లైబ్రేరియన్లకు అందజేశారు.
ఆగిరిపల్లి: పొలంలో మెరక నిమిత్తం అనుమతులు తీసుకొని అధికార పార్టీ నాయకులు మట్టిని యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. మండలంలోని కొమ్మూరు రిజర్వాయర్ పరిధిలో కృష్ణవరం, సురవరం, కొమ్మూరుకి చెందిన వారు పొ లాల మెరక కోసమని అనుమతులు తీసుకున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన నాయకులు కృష్ణవరం గ్రామంలో చెరువుని ఆనుకుని ఉన్న 8 ఎకరాల ముంపు పొలానికి మట్టిని తరలిస్తున్నారు. పొక్లయిన్లతో తవ్వి 50 ట్రాక్టర్లలో వందలాది ట్రిప్పులు ఇలా తరలించేశారు. గ్రా మంలో మెరక పొలాలకు కాకుండా ఆ ఒక్క పొలానికి మట్టిని ఎందుకు తరలిస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.


