ఆన్‌లైన్‌ మందుల విక్రయాలపై నిరసన | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ మందుల విక్రయాలపై నిరసన

May 21 2026 10:01 AM | Updated on May 21 2026 10:01 AM

ఆన్‌లైన్‌ మందుల విక్రయాలపై నిరసన

తణుకు అర్బన్‌: మెడికల్‌ హోల్‌సేలర్స్‌ అండ్‌ రిటైలర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం ఒక రోజు సమ్మె నిర్వహించారు. తణుకులో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు గాదె వెంకట రామఫణి మాట్లాడుతూ ప్రధానంగా ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలు నిలిపివేయాలని, నకిలీ మందులను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. అక్రమ ఈ–ఫార్మసీ కార్యకలాపాలు, జీఎస్‌ఆర్‌ 817ఈ, జీఎస్‌ఆర్‌ 220ఈ నోటిఫికేషన్స్‌ ఉపసంహరించుకోవాలన్నారు. అనంతరం తణుకు మెడికల్‌ అసోసియేషన్‌ హాల్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌ దండు అశోక్‌వర్మకు వినతిపత్రం అందజేశారు. సహకరించిన మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌, సీఐటీయూ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. సంఘ అధ్యక్షుడు గళ్లా దుర్గాప్రసాద్‌, ఉపాధ్యక్షుడు ప్రగళ్లపాటి సూర్యకొండ, కార్యదర్శి గమిని రామచంద్రరావు, కోశాధికారి బొంగు సుబ్బారావు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement