ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలి

May 21 2026 10:01 AM | Updated on May 21 2026 10:01 AM

ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలి

తణుకు అర్బన్‌: ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఏపీపీటీడీ నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ అధ్యక్షుడు సరిదే ఏసుబాబు డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోసం తణుకు ఆర్టీసీ డిపో వద్ద రెండు రోజులపాటు నిర్వహించే గేట్‌ మీటింగ్‌ కార్యక్రమంలో భాగంగా బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీ్త్ర శక్తి బస్సుల్లో జీరో టికెట్‌ విధానాన్ని నిలుపుదల చేసి, మిగిలిన ప్రయాణికులకు మాత్రమే టికెట్స్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, పీఆర్సీ కమిటీని నియమించి ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు, అరియర్స్‌, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌లు ఇవ్వా లని, పదవీ విరమణ, మృతిచెందిన సిబ్బందికి వెంటనే సెటిల్‌మెంట్స్‌ చేయాలని కోరారు. అలాగే ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్టీసీ సిబ్బంది ద్వారానే ని ర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంఘ కార్యదర్శి బయ్యే సుబ్బారావు, పబ్లిసిటీ సెక్రటరీ మాటూరి రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement