పొగాకు వేలం కేంద్రాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పొగాకు వేలం కేంద్రాల పరిశీలన

May 21 2026 10:01 AM | Updated on May 21 2026 10:01 AM

జంగారెడ్డిగూడెం: రైతులు పొగాకును గ్రేడింగ్‌ చేసే సమయంలో ఎన్‌టీఆర్‌ఎం రాకుండా చర్యలు తీసుకోవాలని పొగాకు బోర్డు గుంటూరు మేనేజర్‌(ఎక్స్‌టెన్షన్‌) సురేఖ అన్నారు. బుధవారం జంగారెడ్డిగూడెం వర్జీనియా వేలం కేంద్రం 1, 2 లను ఆమె రాజమండ్రి ఆర్‌ఎం జె.సురేంద్రకుమార్‌తో కలిసి సందర్శించారు. పొగాకు మార్కెట్‌ గురించి పొగాకు కొనుగోలుదారులతో చర్చించి రైతులకు మంచి యావరేజ్‌ ధర వచ్చే విధంగా కొనుగోలు జరపాలని సూచించారు. అలాగే రైతులతో సమావేశంలో భాగంగా పొగాకు గ్రేడింగ్‌ గురించి, ప్రస్తుతం ఉన్న పొగాకు మార్కెట్‌ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని పంట నియంత్రణ గురించి సూచనలు చేశారు. జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రాల్లో పరిధిలో ఉన్న తాడువాయి, వేగవరం, నరసన్నపాలెం గ్రామాల్లో పొగాకు క్యూరింగ్‌ బ్యాలెన్స్‌, గ్రేడింగ్‌ పాయింట్లను పరిశీలించి గ్రేడింగ్‌ చేసేటప్పుడు ఎన్‌టీఆర్‌ఎం రాకుండా గ్రేడింగ్‌ చేసుకోవాలని సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రాల ఆక్షన్‌ సూపరింటెండెంట్‌లు గ్రేస్‌ మార్గరెట్‌, ప్రశాంత్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement