ముగిసిన వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు

May 21 2026 10:01 AM | Updated on May 21 2026 10:01 AM

వెయిట్‌ లిఫ్టింగ్‌లో జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో పాల్గొన్న లిఫ్టర్లు

ఏలూరు రూరల్‌: శాప్‌ లీగ్స్‌ పోటీల్లో భాగంగా బుధవారం ఏలూరు ఇండోర్‌ స్టేడియంలోని వెయిట్‌ లిఫ్టింగ్‌ హాల్లో జిల్లాస్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 50 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చాటిన వారు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికకానున్నారు. ఈ సందర్భంగా డీఎస్‌డీఓ ఎస్‌ఏ అజీజ్‌ రాష్ట్ర ఒలింపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి బడేటి వెంకట్రామయ్య మాట్లాడుతూ కఠోర సాధనతో బాలబాలికలు వెయిట్‌లిఫ్టింగ్‌లో సత్తా చాటవచ్చన్నారు. రాష్ట్రస్థాయి పోటీలు ఏలూరులోనే నిర్వహిస్తామన్నారు. పోటీల ప్రారంభోత్సవంలో సెట్‌వెల్‌ సీఈఓ కెఎస్‌ ప్రభాకరరావు, రాష్ట్ర వెయిట్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి దీన్షాబాబు, పశ్చిమగోదావరి జిల్లా డీఎస్‌డీఓ ఎన్‌ మోహన్‌దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement