ఉంగుటూరు: జాతీయ రహదారిలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణతో ముందకు వెళుతున్నామని ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం చేబ్రోలు పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతీ య రహదారిపై గంజాయి రవాణాను అరికట్టడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని నేరాల అదుపునకు చర్యలు చేపట్టామన్నారు. మహిళల రక్షణకు జిల్లాలో 25 వేల కెమెరాలు అమర్చామన్నారు. అనంతరం ఆయన మహి ళా పోలీసులతో సమావేశమయ్యారు. గ్రామా ల్లో ప్రజలతో మమేకం కావాలని, గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్‌పై పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. సోషల్ మీడియా ప్రభావంతో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, సెల్‌ఫోన్లకు పిల్లలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారన్నారు. పరీక్షల్లో అధిక మార్కులు వచ్చిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల పిల్లలను సత్కరించారు. మహిళా పోలీసులు, చేబ్రోలు పోలీసులకు హె ల్మెట్లు అందించారు. తిరుమల పాల పరిశ్రమ అందించిన అంబులెన్స్‌ను మరోమారు ఐజీతో డాక్టర్ శ్రావణరెడ్డి పీహెచ్‌సీకి అందజేశారు. తొలుత స్టేషన్‌లో రికార్డులను ఆయన పరిశీలించారు. ఎస్పీ కేపీ శివకిషోర్, డీఎస్పీ శ్యామ్‌కుమార్, సీఐ రజనీకుమార్, ఎస్సైలు సూర్యభగవాన్ (చేబ్రోలు), మణికుమార్ (గణపవరం ), ఏలూరు ఎస్‌బీ ఎస్సై ఐ.రమేష్ (నిడమర్రు) పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం మత్స్యకారుల సేవలో పథకంలో భాగంగా జిల్లాకు చెందిన 1,774 మత్స్యకార కుటుంబాలకు రూ.3.54 కోట్ల వేట నిషేధ సాయాన్ని ఇన్‌చార్జి కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అందజేశారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సాయాన్ని జమచేసినట్టు ఆయన చెప్పారు. సముద్రపు నాచు (సీ వీడ్) పెంపకం వంటి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలపై మత్స్యకారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మత్స్యశాఖ జేడీ డి.శ్రీనివాస్, సహాయ సంచాలకుడు ఎల్‌ఎల్‌ఎన్ రాజు, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు మైల వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం కలెక్టరేట్‌లో బుధవారం ఎంఎస్‌ఎంఈ వర్క్‌షాప్ ని ర్వహించనున్నట్టు ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్ లు, యువ ఆవిష్కర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పరిశ్రమల అధికారులతో సమీక్షించారు. వర్క్‌షాప్‌లో పాల్గొనడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదని స్పష్టం చేశారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 18 విడతల్లో 399 భూసమస్యల దరఖాస్తులను పరిష్కరించినట్టు ఇన్‌చార్జి కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు అనుబంధంగా రెవెన్యూ క్లినిక్స్‌ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మొత్తంగా 684 దరఖాస్తు లను తీసుకున్నామన్నారు. డివిజన్ల వారీగా భీమవరంలో 107 దరఖాస్తులు, నరసాపురంలో 104 దరఖాస్తులు, తాడేపల్లిగూడెంలో 50 దరఖాస్తులను పరిష్కరించామన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు పాల్పడితే చర్యలు తప్పవని ఇన్‌చార్జి కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. జనగణనకు జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు. ఇటీవల భీమవరంలో విధులు నిర్వహిస్తున్న వార్డు సెక్రటరీ కేవీఆర్ కిషోర్‌పై జరిగిన దాడి ఘటన వివరాలను ఆ శాఖ ప్రతినిధులు మంగళవారం ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ దాడి ఘటనపై కేసు నమోదు చేశారని, ఇటువంటి ఘటనలను ఉపేక్షించేది లేదన్నారు. జనగణ నకు వచ్చిన సిబ్బందిపై అనుమానాలు ఉంటే తహసీల్దార్ కార్యాలయం, కలెక్టరేట్‌లోని కంట్రోల్‌రూమ్‌లో సంప్రదించాలన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ పనితీరు కనబరిచి జిల్లా వైద్యారోగ్య వ్యవస్థ ప్రతిష్టను నిలబెట్టాయని కలెక్టర్ సీహెచ్ నాగ రాణి తెలిపారు. హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తాజా పనితీరు అంచనాల్లో జిల్లాలోని 34 పీహెచ్‌సీల్లో 33 కేంద్రాలు ఏ గ్రేడ్ సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు.


