లైంగిక దాడులు అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

లైంగిక దాడులు అరికట్టాలి

May 20 2026 10:25 AM | Updated on May 20 2026 10:25 AM

మోటార్‌సైకిల్‌ నుంచి జారిపడి..

మోటార్‌సైకిల్‌ నుంచి జారిపడి..
మోటార్‌సైకిల్‌పై నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందిన ఘటన పెనుగొండ మండలం దొంగరావిపాలెంలో చోటుచేసుకుంది. 8లో u
ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి

ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): సమాజంలో బాలల పై లైంగిక దాడులు పెరిగిపోయాయని, వాటిని అరికట్టడానికి సమాజంలో ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్‌.శ్రీలక్ష్మి సూచించారు. మంగళవారం వట్లూరు లోని వెలుగు కార్యాలయంలో జాగృతి పథకం–2025 సురక్షిత్‌ భవిష్య–పోక్సో కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేశారని, ఈ చట్టంలో నేరస్తులను కఠినంగా శిక్షిస్తారన్నారు. ఇటువంటి నేరాలు ఎక్కువగా బంధువులు, స్నేహితుల ద్వారానే జరుగుతున్నాయన్నారు. మహిళలు, బాలలపై జరిగే నేరాల్లో బాధితులకు జిల్లా న్యాయ సేవా ధికారి సంస్థ ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తుందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ మెంబర్‌ న్యాయవాది పి.వెంకటేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి, ఏలూరు జిల్లా బాలల సంరక్షణ అధికారిణి సూర్యచక్రవేణి, డీఆర్‌డీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌ అనిత, ప్యానల్‌ న్యాయవాదులు ఎ.గంగాభవాని, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement