ఏలూరు టౌన్: జిల్లాలో నాటుసారా, నకిలీ మద్యం, కల్తీ కల్లు, మాదకద్రవ్యాల నేరాలపై ఉక్కుపాదం మోపాలని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని ఎకై ్సజ్ ప్రొహిబిషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ హెచ్చరించారు. మంగళవారం స్థానిక ఎకై ్సజ్ డీసీ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ ఎకై ్సజ్ అధికారులతో ఆయన స మావేశం నిర్వహించారు. నవోదయం కార్యక్రమం ద్వారా నాటుసారా కట్టడి చేస్తూ గ్రామాల్లో మరోసారి సారా తయారీ పునరావృతం కాకుండా పటిష్ట చర్య లు చేపట్టాలని చెప్పారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలనీ, నిందితులకు కఠిన శిక్షలు కోర్టుల్లో విధించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కక్షిదారులు రాబోయే మెగా లోక్‌అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించుకునేలా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రాష్ట్ర సరి హద్దు వెంబడి, చెక్‌పోస్టుల్లోనూ పటిష్ట నిఘా ఏ ర్పాటు చేస్తూ రాష్ట్రంలోకి నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ ప్రవేశించకుండా అరికట్టాలని చెప్పారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా కేర్ కమిటీతో విద్యాసంస్థల్లోనూ, పరిశ్రమల్లోనూ అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. మద్యం దుకాణదారులు విధిగా నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేవీఎన్ ప్రభుకుమార్, ఏలూరు జిల్లా ఎక్సైజ్ అధికారి ఎ.అవులయ్య, పశ్చిమగోదావరి జి ల్లా ఎకై ్సజ్ అధికారి బి.సుబ్బారావు, జిల్లా అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరిటిండెంట్లు, 13 మంది సీఐలు, ఎన్‌ఫోర్స్‌మెంట్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


