ధర్మాకోల్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ధర్మాకోల్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం

May 20 2026 10:25 AM | Updated on May 20 2026 10:25 AM

ధర్మాకోల్‌ పరిశ్రమలో అగ్నిప్రమాదం పోక్సో కేసులో ముగ్గురి అరెస్ట్‌ ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ఉంగుటూరు: చేబ్రోలులోని లక్ష్మీ సమన్విత ధర్మాకోల్‌ పరిశ్రమలోని గోదాములో మంగళవారం తెల్లారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో గోదాములో ఉన్న ధర్మాకోల్‌ పెట్టెలు దగ్ధమయ్యాయి. లక్షలాది రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని పరిశ్రమ యాజమాన్యం తెలిపింది. పరిశ్రమలో మంటలను అదుపుచేసే పటిష్టమైన వ్యవస్థ ఉండటంతో ముడి సరుకు నిల్వ ఉంచిన గోదాములోకి మంటలు వ్యాపించకుండా సిబ్బంది కట్టడి చేశారు. భీమడోలు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

పాలకోడేరు: విస్సాకోడేరులో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు నర్సాపురం డీఎస్పీ ఎం సుధాకర్‌రావు తెలిపారు. బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి మంచెం వెంకట గణేష్‌, బ్లాక్‌ మెయిల్‌ చేసి అత్యాచారం చేసిన మరో ఇద్దరు బడేటి దుర్గా మహేష్‌ అలియాస్‌ బాబి, దేవరకొండ భోగేశ్వరరావులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నాలుగో నిందితుడు ఆకుల చిన్న పరారీలో ఉన్నాడని, అరెస్ట్‌ చేసిన ముగ్గురిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు.

ఉండి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి గాను విద్యార్థులు జూన్‌ 30వ తేదీలోగా ఽఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ జిల్లా కన్వీనర్‌, ఎన్నార్పీ అగ్రహారం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యార్థులు తమ సమీపంలోని (ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం, ఆచంట) ప్రభుత్వ ఐటీఐలో ఒరిజినల్‌ సర్టిఫికెట్లను తీసుకువెళ్లి వెరిఫికేషన్‌ చేయించుకుని రసీదు పొందాలన్నారు. కౌన్సెలింగ్‌ సమయంలో రసీదు తప్పనిసరిగా చూపించాలన్నారు. వివరాలకు 08816 297093, 96664 07468 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement