పెనుగొండ: మోటార్‌సైకిల్ నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందింది. పెనుగొండ ఏఎస్సై అంజిబాబు తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయ పురం మండలం అంకంపాలెంకు చెందిన పేరూరి వెంకట రమణ (53) మధుమేహ సమస్యలు, హైపర్ టెన్సన్‌తో బాధపడుతోంది. మంగళవారం ఉదయం కుమారుడు సతీష్‌తో కలసి మోటార్‌సైకిల్‌పై తణుకు వైపు వెళ్తుండగా దొంగరావిపాలెంవద్ద అకస్మాత్తుగా స్పృహ తప్పి రోడ్డపై పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే వెంకట రమణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


