భీమవరం: సహకార సంఘాల ఉద్యోగులకు ప్రభు త్వం ఇచ్చిన హామీలకు విరుద్ధంగా జీఓ విడుదల చేయడంపై సోమవారం భీమవరం సహకార కేంద్రబ్యాంక్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. సహకార ఉద్యోగుల సంఘం రాష్ట్ర జేఏసీ సభ్యుడు నందమూరి సుబ్బారావు మాట్లాడుతూ 2025 డిసెంబర్ 6 నుంచి ఫిబ్రవరి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల ఉద్యోగులు వేతన సవరణ, గ్రాట్యూటీ చెల్లింపు, ఆరోగ్య బీమా, పదవీ విర మణ వయసు పెంపు, సర్వీసుల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్ల సాదనకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో నిరవధిక సమ్మె చేపట్టిన సందర్భంలో మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర సహకార బ్యాంకు చైర్మన్ గన్ని వీరాంజనేయులు రాష్ట్ర ఉద్యోగుల జేఏసీతో చర్చలు జరిపి సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే హామీలకు విరుద్ధంగా ఉద్యోగుల హక్కులకు భంగం కలిగేలా జీఓ 322 వి డుదల చేసి ఉద్యోగులను మోసం చేయడం దు ర్మార్గమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత చ ర్యను నిరసిస్తూ జీఓ కాపీలను దహనం చేసినట్టు చెప్పారు. తాడేరు, ఈలంపూడి, గూట్లపాడు, వెంప, యండగండి, విస్సాకోడేరు, కుముదవల్లి, కాళ్ల సహకార సంఘాల ఉద్యోగులు పాల్గొన్నారు.


