వ్యాట్‌ వాత.. పెట్రో ధరల మోత | - | Sakshi
Sakshi News home page

వ్యాట్‌ వాత.. పెట్రో ధరల మోత

May 19 2026 1:28 AM | Updated on May 19 2026 1:28 AM

వ్యాట్‌ వాత.. పెట్రో ధరల మోత

తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో వ్యాట్‌ మోతతో పెట్రో ధరల మోత మోగుతుందని, చంద్రబాబు పెట్రో మోసం ప్రజలకు భారంగా మారిందని వైఎస్సార్‌సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్‌, అప్సడా మాజీ వైస్‌ చైర్మన్‌ వడ్డి రఘురాం విమర్శించారు. సోమవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంపై పెట్రో భారం రూ.3,391 కోట్లు పడుతుందని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో పెట్టి, ఈ విషయాన్నీ గాలికొదిలేశారన్నారు. రాష్ట్రంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) ఎక్కువగా ఉండటంతో దేశం మొత్తం మీద ఇక్కడే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అధికంగా ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు,లోకేష్‌ పెట్రో ధరల పెరుగుదలకు పన్నులే కారణమని చెప్పి, ఇప్పుడు నిస్సిగ్గుగా ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పెరిగాయని, ప్రజలంతా పొదుపు పాటించేలా అవగాహన కల్పించాలని మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలను దగా చేసేలా రాష్ట్రంలో వ్యాట్‌ మోతతో వా తలు పెడుతున్నారన్నారు. టీడీపీ కూటమికి ప్రజలే బుద్ధి చెప్పాలని రఘురాం పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement