ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ఉదయం 11.47 గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. ట్రస్టుబోర్డు సభ్యులకు ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. గోపాలపురం, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకటరాజు, బొలిశెట్టి శ్రీనివాస్‌తో పాటు ఈఓ త్రినాథరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఒకేసారి సభ్యులందరితో..
ధర్మకర్తల మండలి సభ్యులందరితో ఒకేసారి ఆలయ ఈఓ త్రినాథరావు ప్రమాణస్వీకారం చేయించారు. ట్రస్టుబోర్డు చైర్మన్‌గా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్వీ సుధాకరరావు (మైలవరం), సభ్యులుగా చింతమనేని హనుమంతరావు, యెలమాటి శ్రీనివాసరావు, చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య, పల్లి శ్రీనివాసరెడ్డి, ఆల్టి సత్యనారాయణ, కాకి సురేష్‌కుమార్, అచ్యుత సత్యనారాయణ, హోట వీరభద్రరావు, కంపసాటి నాగ సీత, పాలూరి వెంకట చరిత, కింతాడ కళావతి, బత్తిన ప్రమీల, కడియం సత్యవతి, చిరుగూరి సుశీల, కసిరెడ్డి మధులత, యుకే సుహాసిని, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఆలయ ప్రధానార్చకులు పీవీఎస్‌ఎస్‌ఆర్ జగన్నాథాచార్యులు, ప్రత్యేక ఆహ్వానితులుగా ముప్పరాజు శ్రీనివాసరావు, గెడ్డమనుగు రవికుమార్, తాండ్ర సందీప్‌లతో చినవెంకన్న సాక్షిగా ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు మాట్లాడుతూ శ్రీవారి సేవలో తరిస్తూ, భక్తులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ట్రస్ట్‌బోర్డు సభ్యులకు దక్కిందన్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్‌ఎన్ నివృతరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డీవీ భాస్కర్, డీఈఓ వై.భద్రాజీ, ఏఈఓలు ఎం.దుర్గారావు, పి.నటరాజారావు, ఉమాపతి, సూపరింటెండెంట్లు ఎంఎస్‌ఎల్ శ్రీనివాస్ (వాసు), ఐ.రమణరాజు, వి.నగేష్, పద్మావతి, కె.కిషోర్, జి.సుబ్రహ్మణ్యం, డీఈ టి.సూర్యనారాయణ తదితరులున్నారు.


