భీమవరం (ప్రకాశంచౌక్): దేశవ్యాప్తంగా ఈనెల 1 నుంచి 30 వరకు డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న జనగణన–2027 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఎన్యుమరేటర్లకు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రజలకు పిలుపునిచ్చారు. గుర్రపుడెక్క ద్వారా వర్మి కంపోస్ట్ తయారీ చర్యలను వేగవంతం చేయాలన్నారు. జనగణన, అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీటి సరఫరా, వర్మీ కంపోస్టు తయారీ వంటి పలు అంశాలపై సంబంధిత శాఖాధికారులతో గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫెరెన్స్ హాల్‌లో సమీక్షించారు.
పీఎం సూర్యఘర్‌పై సమీక్ష
జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి, నిర్ధేశించిన లక్ష్యాలను నూరుశాతం సాధించాలని కలెక్టర్ నాగరాణి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం పథకం పురోగతిపై కలెక్టరేట్ నుంచి సెక్షన్ల వారీగా అధికారులతో సమీక్షించారు.


