22 నుంచి దివ్యాంగుల నిర్ధారణ వైద్య శిబిరాలు
సద్వినియోగం చేసుకోవాలి
కై కలూరు: జిల్లా సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ప్రత్యేకావసరాలు కలిగిన యువతీ, యువకులకు ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దివ్యాంగుల నిర్ధారణ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి షెడ్యూలు విడుదలైంది. క్యాంపుల్లో ఎంపిక చేసిన వారికి త్వరలో హియిరింగ్ ఎయిడ్స్, సీపీ వీల్ చైర్ విత్ కమోడ్, బిగ్ వీల్ చైర్, స్మాల్ వీల్ చైర్, వాకింగ్ స్టిక్స్ ఎడ్జస్ట్‌బుల్, బ్రైలీ కిట్ వంటి పరికరాలను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలో 7 నియోజకవర్గాల్లో కలిపి ఒకటి నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల్లో ప్రత్యేకావసరాల కలిగిన వారిని 3,301 మందిని గుర్తించారు. వీరికి వైద్య శిబిరంలో నిర్ధారణ తర్వాత పరికరాలను అందించడానికి ఎంపిక చేయనున్నారు.
వైద్య శిబిరాల షెడ్యూల్
పోలవరం నియోజకవర్గంలోని ప్రత్యేకావసరాలు కలిగిన 608 మందికి 22వ తేదీన బుట్టాయిగూడెం జెడ్పీ హైస్కూల్‌లో వైద్య శిబిరం నిర్వహించనున్నారు. అలాగే చింతలపూడి నియోజకవర్గంలోని 562 మందికి 23వ తేదీన చింతలపూడి జెడ్పీ హైస్కూల్‌లో, కై కలూరు నియోజకవర్గంలోని 339 మందికి 24వ తేదీన కై కలూరులో భవిత కేంద్రం, ఉంగుటూరు నియోజకవర్గంలోని 317 మందికి 25వ తేదీన నారాయణపురం జెడ్పీ హైస్కూల్, నూజివీడు నియోజకవర్గంలోని 462 మందికి 26వ తేదీన నూజివీడు ఎస్‌ఆర్‌ఆర్ జెడ్పీ హైస్కూల్, దెందులూరు నియోజకవర్గంలోని 435 మందికి 27వ తేదీన దెందులూరు జెడ్పీ హైస్కూల్, ఏలూరు నియోజకవర్గంలోని 578 మందికి 28వ తేదీన ఏలూరు భవిత కేంద్రము, అశోకవర్ధని మున్సిపల్ పాఠశాల అశోక్ నగర్ ఏలూరులో వైకల్య నిర్ధారణ పరీక్షలు జరుగుతాయి.
కై కలూరు భవిత సెంటర్
జిల్లాలో 3,301 మంది ప్రత్యేకావసరాల చిన్నారుల గుర్తింపు
ఉచితంగా ఉపకరణాలపంపిణీకి కసరత్తు
క్యాంపు రోజున రవాణా ఖర్చులు, ఉచిత భోజన సదుపాయం
ప్రత్యేకావసరాలు కలిగిన విద్యార్థులకు ప్రభుత్వం అత్యంత ఖరీదైన ఉపకరణాలను పంపిణీ చేస్తోంది. జిల్లాలో 7 నియోజకవర్గాల్లో క్యాంపులు జరుగుతాయి. రవాణా ఖర్చులతో పాటు భోజన సదుపాయం కల్పిస్తున్నాం. తల్లిదండ్రులు విద్యార్థులను సకాలంలో వైద్య శిబిరాలకు తీసుకురావాలి. గుర్తించిన వారికి త్వరలో పరికరాలు అందిస్తాం.
– డాక్టర్ కే.పంకజ్‌కుమార్, అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్, సమగ్ర శిక్షా, ఏలూరు జిల్లా
22 నుంచి దివ్యాంగుల నిర్ధారణ వైద్య శిబిరాలు


