అప్రోచ్ రోడ్డునూ వదలరు
భీమడోలు మండలం సూరప్పగూడెంలోని ఐస్ ప్లాంట్ పక్కనే ఉన్న అప్రోచ్ రోడ్డు గట్టుపై అక్రమార్కుల కన్ను పడింది. రాత్రికి రాత్రి మట్టిని తవ్వి తరలించారు. 8లో u
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్వతంత్ర భారతదేశ సుపరిపాలన కోసం రాజ్యాంగం రూపొందించారని, రాజ్యాంగంపై ప్రతి భారతీయుడు అవగాహన కలిగి ఉండాలని, సమసమాజ నిర్మాణానికి రాజ్యాంగం ఎంతో దోహదపడుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం సెట్‌వెల్ డిపార్ట్‌మెంటు, మానవతా స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా భారత రాజ్యాంగంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల ప్రారంభ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రత్న ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి భారతీయుడు రాజ్యాంగాన్ని పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాది రత్నరాజు, సెట్‌వెల్ సీఈవో కే ప్రభాకర్ రావు, గ్రంథలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్ బాబు, మానవతా రీజియన్ చైర్మన్ రత్నాకర్ రావు, మానవతా అధ్యక్షుడు ఎమ్మెస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నూజివీడు: రాష్ట్రంలో జరుగుతున్న ఎన్‌కై ంటర్ల పర్వాన్ని ఆపాలని దీనిపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి.హరినాథ్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో అరెస్టు చేసిన వారందరినీ కోర్టులో హాజరపరచాలని డిమాండ్ చేశారు. నక్సలైట్ సమస్య రాజకీయ సమస్యగా చూడాలి తప్ప శాంతిభద్రతల సమస్యగా చూడడం అవివేకమన్నారు. 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీని అంతం చేస్తామని చెప్పిన దానికి ముందే హిడ్మాను ఎన్‌కౌంటర్ చేశామని చెప్పడం చట్టధిక్కారానికి పాల్పడడమేనని, దీన్ని వామపక్ష ప్రజాస్వామ్య పౌరహక్కుల సంఘాల నేతలు ఖండించాలన్నారు.


