ఒకేరోజు రెండు మెడికల్ సర్టిఫికెట్లా?
మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆగ్రహం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: దేవుడితో సమానంగా భావించే వైద్యుల సైతం ఒత్తిళ్లకు తలొగ్గడం వైద్య వృత్తికి కళంకమని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతునూరు కోపరేటివ్ సొసైటీ మాజీ చైర్మన్ డీఎన్‌వీడీ ప్రసాద్ అరెస్టు అనంతరం దెందులూరు సీహెచ్‌సీ సూపరింటెండెంట్ సుందర్‌బాబు పరీక్షలు నిర్వహించారు. మొదటి ఇచ్చిన మెడికల్ రిపోర్టులో గుండె, మోకాలు ఆపరేషన్ జరిగిందని, రిమాండ్‌కు ఫిట్ కాదని సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. సర్టిఫికెట్ ఇచ్చిన సూపరింటెండెంట్ మళ్లీ రిమాండ్‌కు ఫిట్ అని రాయటం వెనుక ఎవరి ఒత్తిడి ఉందని, ఎందుకు సర్టిఫికెట్ మార్చారని ప్రశ్నించారు. ఒక రోజే రిమాండ్‌కు ఫిట్ కాదని మళ్లీ ఫిట్‌గా ఉన్నారని సర్టిఫికెట్ మార్చాల్సిన అవసరం సూపరింటెండెంట్‌కు ఎందుకు వచ్చిందన్నారు. దెందులూరు సీహెచ్‌సీ సూపరింటెండెంట్ ఉదంతంపై న్యాయపోరాటం చేస్తామన్నారు. తక్షణమే ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణకు ఆదేశించాలన్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ నేతలను రెండుసార్లు అక్రమ అరెస్టులు చేసి రిమాండ్‌కు పంపాలని చూశారని, న్యాయస్థానం రెండుసార్లు రిమాండ్ తిరస్కరించడమే కాక కేసు పెట్టిన ఎస్సై మెమో ఇచ్చిందని అబ్బయ్య చౌదరి గుర్తు చేశారు. న్యాయస్థానాలపై తమకు గౌరవం ఉందన్నారు.
ఒకేరోజు రెండు మెడికల్ సర్టిఫికెట్లా?


