
టపాసులు కొనలేకపోతున్నాం
బాణసంచా ధరలు చూస్తుంటే కొనలేని పరిస్థితి. గతంలో ఓ మాదిరిగా ఉన్న ధరలు ప్రస్తుతం బాగా పెరిగాయి. రూ.500 తీసుకెళ్తే ఏమీ రావడం లేదు. ప్రతిరకం ధరలు పెరిగాయి. ఇలా అయితే దీపావళి సందడి తగ్గుతుంది.
– ఎన్.శ్యామ్‌కుమార్, మోగల్లు
గతేడాదితో పోలిస్తే దీపావళి టపాసుల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో సరదాగా జరుపుకునే దీపావళిని నిరాశగా జరుపుకోవాల్సి వస్తుంది. రేట్లు ఎక్కువగా ఉండటంతో కొనుగోలు చేయడానికి కూడా వెళ్లడం లేదు.
– బేరా రామ్, నూజివీడు
టపాసులు ధరలతో మోతెస్తున్నాయి. కొనాలంటే చాలా ఇబ్బంది. పేద, మధ్యతరగతి వర్గాలకు ఇది భారం. అలాగే నిత్యావసరాలు, పూలు, పండ్ల ధరలు పెరిగాయి. పండగ అంతంతమాత్రంగానే జరుపుకోవాలి.
– అభినేష్, నూజివీడు

టపాసులు కొనలేకపోతున్నాం

టపాసులు కొనలేకపోతున్నాం