సమ్మెకు సై! | - | Sakshi
Sakshi News home page

సమ్మెకు సై!

Oct 19 2025 6:55 AM | Updated on Oct 19 2025 6:55 AM

సమ్మె

సమ్మెకు సై!

పోరుబాట కనీస వేతనం ఇవ్వాలి చిన్నచూపు తగదు ఆప్కాస్‌ను కొనసాగించాలి

న్యూస్‌రీల్‌

మున్సిపల్‌ కార్మికుల ప్రధాన డిమాండ్లు

మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

వరుసగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని తీరు

నవంబర్‌ 3 నుంచి సమ్మెకు మున్సిపల్‌ కార్మికుల నోటీసులు

ఆదివారం శ్రీ 19 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

ఏలూరు (టూటౌన్‌): తమ సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి సమ్మె లోకి వెళ్లనున్నట్లు యూనియన్‌ నాయకులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలం చెందిందని విమర్శిస్తున్నారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కారం కోరుతూ ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్‌కు సమ్మె నోటీసును ఇప్పటికే అందజేశారు. 12వ పీఆర్సీ ప్రకటించి, 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని, మరణించిన, పదవి విరమణ పొందిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో విధులలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. కార్పొరేషన్‌, మున్సిపల్‌, నగర పంచాయతీలో ్లపెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికుల నిష్పత్తిని పెంచాలని, పర్మినెంట్‌ కార్మికుల పెండింగ్‌ బకాయి లు తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నా రు. కార్మికుల బ్యాంకు ఖాతాలు బలవంతంగా యాక్సిస్‌ బ్యాంకుకు మార్చరాదని, కార్మికుల పదవీ విరమణ వయోపరిమితి 62 ఏళ్లకు పెంచాలని కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మున్సిపల్‌ కాలనీలో నిర్మించాలని డిమాండ్‌ చేశారు.

సమ్మె నోటీసు అందజేత

రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మి కులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నవంబర్‌ 3 నుంచి సమ్మె చేయనున్నట్లు మున్సిపల్‌ ఉద్యోగుల సంఘాల నాయకులు చెబుతున్నారు. దీనిలో భాగంగా అక్టోబరు 14న ఏలూరు కార్పొరేషన్‌ కమిషనర్‌ ఎ.భానుప్రతాప్‌కు జిల్లా నాయకులు సమ్మె నోటీసు అందజేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్‌ తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని మున్సిపల్‌ ఉద్యోగ, కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.

పెరిగిన ధరలకు అనుగుణంగా మున్సిపల్‌ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చేనెల 3 నుంచి చేపట్టే సమ్మెలో ఉద్యోగ, కార్మిక సిబ్బంది, ఇంజనీరింగ్‌ సిబ్బంది అంతా పాల్గొనాలి. యూనియన్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏలూరు కమిషనర్‌కు సమ్మె నోటీసును అందించాం.

– ఎ.అప్పలరాజు, ది జోనల్‌ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి, ఏలూరు

రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో పనిచేస్తున్న మున్సిపల్‌ ఉద్యోగ, కార్మిక సిబ్బంది, ఇంజనీరింగ్‌ సిబ్బందిపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూడటం తగదు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను తక్షణం పరిష్కరించాలి. ఉద్యోగ, కార్మికులందరికీ గుర్తింపు కార్డులను అందజేయాలి.

– భజంత్రీ శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌, ఏలూరు

కాంట్రాక్ట్‌–ఔట్‌ సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులను ఆప్కాస్‌ విధానంలో కొనసాగించాలి. జీఓ నెం.12 ప్రకారం 2024 సంక్రాంతి పండగ బోనస్‌ రూ. వెయ్యిని పెండింగ్‌లో ఉన్న సిబ్బంది అందరికీ వెంటనే చెల్లించాలి. వాటర్‌వర్క్స్‌, వాటర్‌ సప్లయ్‌, వీఽధి లైట్లు, డ్రైనేజీ, అండర్‌ డ్రైనేజీ పనుల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ రక్షణ పరికరాలను అందించాలి.

– దొడ్డిగర్ల నాగబాబు,

మున్సిపల్‌ కార్మికుడు, ఏలూరు కార్పొరేషన్‌

11వ పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలి.

బకాయిపడిన డీఏలను తక్షణం చెల్లించాలి.

పెండింగ్‌లో ఉన్న సరెండర్‌ లీవ్‌ పేమెంట్స్‌లో చెల్లించాలి.

కొత్త పెన్షన్‌ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలి.

సీనియర్స్‌ అందరికీ పదోన్నతులు ఇవ్వాలి.

ఔట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌, ఎన్‌ఎంఆర్‌లను రెగ్యులరైజ్‌ చేయాలి.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఔట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ సిబ్బందికి నెలకి రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలి.

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌ ఇవ్వాలి.

ఎన్‌ఎంఆర్‌లకు హెచ్‌ఆర్‌ఏ, డీఏతో కలిపి ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలి.

పీహెచ్‌ డ్రైవర్లగా, ఫిట్టర్లుగా, ట్యాప్‌ ఇన్‌స్పెక్టర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలి.

ఔట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ ఎన్‌ఎంఆర్‌లతో కలుపుకుని బకాయి పడిన మూడేళ్ల యూనిఫాం, కుట్టుకూలీ, టవల్స్‌, పాదరక్షలు, కొబ్బరి నూనె, సబ్బులు ఇవ్వాలి.

సమ్మెకు సై! 1
1/5

సమ్మెకు సై!

సమ్మెకు సై! 2
2/5

సమ్మెకు సై!

సమ్మెకు సై! 3
3/5

సమ్మెకు సై!

సమ్మెకు సై! 4
4/5

సమ్మెకు సై!

సమ్మెకు సై! 5
5/5

సమ్మెకు సై!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement