బాలికపై మేనమామ వేధింపులు | - | Sakshi
Sakshi News home page

బాలికపై మేనమామ వేధింపులు

Oct 19 2025 6:55 AM | Updated on Oct 19 2025 6:55 AM

బాలికపై మేనమామ వేధింపులు

బాలికపై మేనమామ వేధింపులు

బాలికపై మేనమామ వేధింపులు

తల్లితో కలిసి చితకబాదిన వైనం

వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలులో ఘటన

కై కలూరు ప్రభుత్వాసుపత్రిలో బాలికకు చికిత్స

కై కలూరు: మేనమామ వేధించడంతో పాటు తల్లి, అమ్మమ్మ, తాత చిత్రహింసలకు గురిచేశారని 9వ తరగతికి చెందిన బాలిక బావురుమంది. నరకం నుంచి బయటపడ్డానని గాయాలను చూపించింది. కై కలూరు మండలం చటాకాయికి చెందిన బాలికపై వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలు సమీప అగ్రహారంలో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం ఆమెను తండ్రి కై కలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చాడు. పోలీసులకు ఆమె వివరాలు వెల్లడించింది. బాధితురాలు, ఆమె తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. చటాకాయికి చెందిన జయమంగళ కుమార అభిమన్యుడుకి ఏలూరు మండలం శ్రీపర్రుకు చెందిన కా మాక్షితో 2009లో వి వాహమైంది. వీరికి 2012లో అమ్మాయి జన్మించింది. అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి కుమార్తె తండ్రి వద్ద ఉంటోంది. కామాక్షి మరో వ్యక్తిని వివాహం చేసుకోగా.. అభిమన్యుడు మరో మహిళను వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమార్తె (14) తండ్రి అభిమన్యుడు వద్దే ఉంటూ భుజబలపట్నం హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది.

దసరా పండక్కి తీసుకెళ్లి.. తండ్రి లేని సమయంలో కామాక్షి, ఆమె తల్లి చటాకాయలో ఉంటున్న బాలిక వద్దకు వచ్చి దసరా పండగకు దుస్తులు కొంటామని ప్రత్తికోళ్లలంక, అక్కడ నుంచి కామాక్షి సోదరుడు ఉమాశంకర్‌, తల్లిదండ్రులు నాగులమ్మ, వెంకటరమణ ఉంటున్న కడప జిల్లా బద్వేలుకు తీసుకువెళ్లారు. బాలికను అక్కడే ఉండాలని బలవంతం చేయడంతో ఆమె నిరాకరించి తండ్రి వద్దకు వెళతానని చెప్పింది. దీంతో తన తల్లి కామాక్షి ఇష్టానుసారం తనను కొట్టిందని బాలిక వాపోయింది. మేనమామ ఉమాశంకర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు పక్కనే పడుకోవాలని అనే వా డని పోలీసుల వద్ద తెలిపింది. బద్వేలులో బాలిక పరిస్థితిని చూసిన ఓ వ్యక్తి తండ్రి అభిమన్యుడికి ఫోన్‌ చేయగా అక్కడికి వెళ్లి శుక్రవారం రాత్రి చటకాయికి తీసుకువచ్చారు. మేనమామ బాలికతో అసభ్యకంగా ప్రవర్తించాడా? లేదా అన్న విషయాన్ని బద్వేలు పోలీసులు విచారిస్తారని కై కలూరు రూరల్‌ ఎస్సై వి.రాంబాబు తెలిపారు. బాలిక విషయంలో తల్లిదండ్రులకు విభేదాలు ఉన్నాయన్నారు. ఫిర్యాదును పోలీసుతో బద్వేలు పంపామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement