
3.4 టన్నుల గంజాయి ధ్వంసం
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో పోలీసులు దాడులు చేసి, వాహన తనిఖీల్లో పట్టుబడిన భారీ గంజాయి నిల్వలను పర్యావరణహిత విధానంలో ధ్వంసం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో గంజా యి ధ్వంసంపై శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో భారీ ఎత్తున పట్టుబడిన 3,403.753 కిలోల గంజాయిని ఆధునిక విధానంలో పర్యావరణానికి హాని లేకుండా ధ్వంసం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లావ్యాప్తంగా కొంత కాలంగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి నిల్వలను గుంటూరు జిల్లాలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సెంటర్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ధ్వంసం చేయించా మని ఎస్పీ స్పష్టం చేశారు. జిల్లాలో రెండేళ్లుగా 58 కేసులకు సంబంధించి 3.4 టన్నుల గంజాయిని పోలీసులు పట్టుకున్నారన్నారు. గంజాయితో పలు సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితుల నేపథ్యంలో గంజాయి నివారణకు పటిష్ట చర్యలు చేపట్టామన్నా రు. జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాలపై ఉ క్కుపాదం మోపుతామని హెచ్చరించారు. జిల్లా అ దనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవిచంద్ర, డీసీఆర్‌బీ సీఐ హ బీబ్ బాషా, సీఐలు జి.సత్యనారాయణ (ఏలూరు వన్‌టౌన్), సీహెచ్ రాజశేఖర్ (పెదవేగి), సీఐ వెంకటేశ్వరరావు (జీలుగుమిల్లి), రామకృష్ణ (కై కలూరు), ఎం.సుబ్బారావు (ఏలూరు మహిళా స్టేషన్), సీఐ క్రాంతికుమార్ (చింతలపూడి), ఎస్సైలు ఉన్నారు.