
అలరించిన యువజనోత్సవాలు
తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో యువజనోత్సవాల్లో డమరుకంతో నృత్యం చేస్తున్న విద్యార్థినులు, జానపద నృత్యం చేస్తున్న విద్యార్థినులు
తణుకు అర్బన్: తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు అలరించాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు నిర్వహించిన క్లాసిక్, ఫోక్, జానపద నృత్యాలతోపాటు వ్యవసాయ రంగ అంశాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, యువజన సర్వీసుల శాఖ, సెట్‌వెల్ ఆధ్వర్యంలో ఈ యువజనోత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హాజరయ్యారు. సెట్‌వెల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కేఎస్.ప్రభాకర్, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్య ఉషారాణి, జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకట కృష్ణారావు, కళాశాల ప్రిన్సిపల్ యుఎల్ సుందరీబాయ్ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి
వారసత్వ సంప్రదాయాలపై అవగాహన పెంచుకొని వాటిని కాపాడాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు . ఎస్‌కేఎస్‌డీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన యువజనోత్సవాల్లో పాల్గొన్న ఆయన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

అలరించిన యువజనోత్సవాలు

అలరించిన యువజనోత్సవాలు