
ఇంటర్ కాలేజీ ఫెన్సింగ్ పోటీలు
భీమవరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇంటర్ కాలేజీ ఎట్ ఫెన్సింగ్ టోర్నమెంట్ శుక్రవారం భీమవరంలోని సీఎస్‌ఎన్ డిగ్రీ కాలేజీలో నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి సుమారు 50 మంది పాల్గొనగా వారికి పలు విభాగాల్లో పోటీలు జరిగాయి. విజేతలకు సీఎస్‌ఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ చీడే సత్యనారాయణ, ప్రిన్సిపల్ సకుమళ్ల సత్యనారాయణ, స్టేట్ ఫెన్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ జీఎస్‌వీ కృష్ణమోహన్ తదితరులు బహుమతులు అందజేశారు.
జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం నూకాలమ్మ ఆలయంలో శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. నిత్య కై ంకర్యాలు, పంచామృతాభిషేకాలు, ఏకాదశ హారతి పూజలు నిర్వహించినట్లు ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ తెలిపారు. అమ్మవారిని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధికి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ కమిటీ ఛైర్మన్ రొంగల నాగేశ్వరరావు, కుటుంబసభ్యులు రూ.5,01,116 అందజేసినట్లు చైర్మన్ తెలిపారు. రొంగల నాగేశ్వరరావు రమాదేవి దంపతులు, దేవీ ప్రసాద్, అనూష దంపతులు, భాస్కర్ కుమార్, సాయి చంద్రిక దంపతులు, వారి కుటుంబ సభ్యులను సత్కరించారు.
నరసాపురం రూరల్: పంచాయతీలో ఇతర సర్పంచుల కాలంలో చెల్లించిన బిల్లులు తాము చెల్లించినట్లుగా చూపించి తమ పరువును దిగజార్చేలా ప్రకటనలు ఇచ్చిన డీఎల్‌పీఓ కిరణ్మయిపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు మల్లవరం సర్పంచ్ సంధి సుజాత తెలిపారు. శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. 2021, ఏప్రిల్ 12, మే 7 తేదీలతో పంచాయతీ సొమ్మును డ్రా చేశారని ఆ సమయానికి సర్పంచిగా ఎన్నికై నప్పటికీ చెక్ పవర్ రాలేదని వాటిని దుర్వినియోగం చేసినట్లు డీఎల్పీఓ షోకాజ్ నోటీసులో పేర్కొన్నారన్నారు. కొంతమంది ఒత్తిడితో నోటీసులు ఇప్పించారని భావిస్తున్నట్లు తెలిపారు.
తాడేపల్లిగూడెం రూరల్: బైక్‌పై వెళ్తున్న వారిని కారు ఢీకొనడంతో ముగ్గురు గాయపడ్డారు. రూరల్ హెచ్‌సీ జిలానీ వివరాల ప్రకారం.. ఉండి మండలం చిలుకూరుకు చెందిన నల్లం సత్యనారాయణ, అతని భార్య, మనువడు గుబ్బల మంగమ్మ గుడికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో బైక్‌పై వస్తున్నారు. వెంకట్రామన్నగూడెం వచ్చే సరికి వారి బైక్‌ను కారు ఢీకొంది. సత్యనారాయణ, అతని భార్య, మనుమడికి గాయాలయ్యాయి. వారిని 108లో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి, అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం భీమవరం తరలించారు. రూరల్ హెచ్‌సీ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటర్ కాలేజీ ఫెన్సింగ్ పోటీలు