
ఇరిగేషన్ భూముల స్వాహా
న్యూస్‌రీల్
ఆక్రమణలు తొలగిస్తాం
రూ. కోట్ల విలువైన ఇరిగేషన్ భూముల కబ్జా
బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
సాక్షి, టాస్క్‌ఫోర్స్: కై కలూరులో కబ్జాల పర్వం యథేచ్చగా కొనసాగుతోంది. కూటమి పాలనలో ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. రూ.కోట్ల విలువైన ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, పుంత పొరంబోకు భూములను పట్టపగలు ఆక్రమించేస్తున్నారు. జిల్లా అధికారులకు పదేపదే ఫిర్యాదులు చేస్తున్న చర్యలు శూన్యం. జాతీయ రహదారుల పక్కనే ప్రభుత్వ భూముల్లో షాపింగ్ కాంప్లెక్సు కట్టి ఏకంగా అద్దెలకు ఇస్తున్నారు. అధికారం మాది.. అడిగేవాడెవడురా? అంటూ అధికారులపై అరుస్తున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా కై కలూరు నియోజకవర్గం ఏలూరు జిల్లాలో చేరింది. దీంతో మా పరిధి కాదంటే.. మాది కాదంటూ అధికారులు కావాలని ఆక్రమణ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు.
ఇరిగేషన్, ఆర్‌ఆండ్‌బీ అధికారులు ఆక్రమణలపై నోరెత్తలేని పరిస్థితి నియోజకవర్గంలో కనిపిస్తోంది. డ్రెయిన్లు, కాల్వలకు మరమ్మత్తులు చేస్తున్నామని ఒక పక్కన గొప్పలు చెబుతూనే మరోవైపు ఆక్రమణల పర్వాన్ని కొందరు నాయకులు ప్రొత్సహిస్తున్నారు. ఎన్నికల్లో విజయానికి కృషి చేశాం.. ఎంతో డబ్బు ఖర్చుచేశాం.. ఆ మాత్రం ఆక్రమణలు చేస్తే తప్పేంటీ..! అనే ధోరణి అక్రమార్కులలో స్పష్టంగా బయటపడుతోంది. ఆక్రమణల స్థలాల్లో అధికారులు హెచ్చరిక బోర్డులు పెడితే గంటల వ్యవధిలో అవి మాయమవుతున్నాయి. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోకపోతే మరిన్ని ఆక్రమించడం ఖాయం కనిపిస్తోంది.
మండవల్లి మండలం భైరవపట్నంలో హెచ్చరిక బోర్డులు పెట్టిన ఇరిగేషన్ సిబ్బంది
ఇరిగేషన్ భూమిలో అనుమతులు లేకుండా నిర్మించిన బోదె
ఆక్రమణదారులకు నోటీసులు పంపుతున్నాం. అయినా లెక్క చేయడం లేదు. బోర్డులు పెడుతున్నా పీకేస్తోన్నారు. ఇరిగేషన్ ఈఈ త్వరలో ఆక్రమణల భూములను పరిశీలిస్తారు. అక్రమ కట్టడాలపై తగు చర్యలు తీసుకుంటాం.
– ఎం.శిరీష, ఇరిగేషన్ సబ్ డివిజన్ డీఈ, కై కలూరు
పామర్రు–దిగమర్రు జాతీయ రహదారి 216లో మండవల్లి మండలం పాత భైరవపట్నం శోభనాద్రిపురం రోడ్డు పక్కన సర్వే నంబరు 36లో సుమారు 60 సెంట్ల ఇరిగేషన్ భూమిని ఆక్రమించారు. ఏకంగా 12 దుకాణ సముదాయాలను నిర్మించారు. ఈ దుకాణాల ద్వారా ఆక్రమణదారుడికి నెలకు రూ.2 లక్షల పైనే ఆదాయం వస్తుంది. ఆక్రమణలపై సెప్టెంబరు 15న ఏలూరు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. పంచాయతీ నోటీసులు అందించింది. కరెంటు సర్వీసును సైతం కట్ చేశారు. ఇరిగేషన్ అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టారు. అయినా నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఆత్మగా భావించే నాయకుడు కొమ్ముకాస్తున్నాడు. కై కలూరు – కోరుకొల్లు దారిలో 30 సెంట్ల ఇరిగేషన్ భూమిని ఆక్రమించారు. కై కలూరు – ఏలూరు రోడ్‌లో ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కన షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాంతాడంత ఉంది.
కై కలూరులో రూ.కోట్ల విలువైన భూముల కబ్జాపై నోరెత్తని అధికారులు
హెచ్చరిక బోర్డులు పెట్టినా లెక్క చేయని వైనం
కూటమి పాలనలో పేట్రేగిపోతున్న భూ దందా

ఇరిగేషన్ భూముల స్వాహా

ఇరిగేషన్ భూముల స్వాహా

ఇరిగేషన్ భూముల స్వాహా

ఇరిగేషన్ భూముల స్వాహా

ఇరిగేషన్ భూముల స్వాహా