
చంద్రబాబు ప్రభుత్వ కుట్ర
పెనుమంట్ర: పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తూ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి సిద్ధమవుతుందని పెనుమంట్ర జెడ్పీటీసీ కర్రి గౌరీ సుభాషిణి అన్నారు. మంగళవారం నియోజకవర్గ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మార్టేరు సెంటర్‌లో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. గౌరీ సుభాషిని మాట్లాడుతూ తక్షణం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయలని డిమాండ్ చేశారు. ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు పిల్లి రుద్ర ప్రసాద్ మాట్లాడుతూ కేవలం దళిత వర్గాలకు అన్యాయం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం వ్యతిరేక విధానాలను ప్రారంభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మట్టకుమారి రాము, సుంకర సీతారాం, కోట వెంకటేశ్వరరావు, మండల పార్టీల అధ్యక్షులు గూడూరు దేవేంద్రుడు, జక్కశెట్టి సంటి, జక్కం శెట్టి శ్రీరామ్, మండలాల ఎస్సీ సెల్ అధ్యక్షులు పలివెల శ్రీనివాస్, బుర్ర రవికుమార్, గొట్టుముక్కల సునీల్ వర్మ, జి ఏసురత్నం, దుర్గాప్రసాద్ ,కోట గిరిధర్, వడ్లపాటి అంబేద్కర్, సాగర్ సుబ్రహ్మణ్యం, కొడమంచిలి రాజు తదితరులు పాల్గొన్నారు.