
ఆశ్రం సెంటర్ పొదల్లో బాలిక
ఏలూరు టౌన్: ఏలూరు శివారు ఆశ్రం హాస్పిటల్ సెంటరు రైల్వే బ్రిడ్జి సమీపంలో ముళ్ళ పొదల్లో బాలికను వదిలేయడం కలకలం రేపింది. డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో వన్‌టౌన్ సీఐ జీ.సత్యనారాయణ, పెదవేగి సీఐ సీహెచ్ రాజశేఖర్, రూరల్ ఎస్సై నాగబాబు, పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
బాలికను గుర్తు తెలియని వ్యక్తులు రైల్వే బ్రిడ్జి పక్కన పొదల్లో వదిలేసి వెళ్ళినట్లు ప్రాథమిక అంచనా. డీఎస్పీ మాట్లాడుతూ.. స్థానికుల సమాచారంతో హుటాహుటిన వెళ్ళి బాలికను వెంటనే ఆశ్రం హాస్పిటల్‌కు తరలించామన్నారు. బాలిక పుట్టుకతోనే మానసికంగా ఎదగని స్థితిలో, శారీరక అనారోగ్యంతో బాధపడుతుందని తెలిపారు. వివరాలు ఇంకా తెలియలేదని, పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని చెప్పారు.