
గోదావరి ఉగ్రరూపం
యలమంచిలి: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో కనకాయలంక కాజ్ వే పై సుమారు ఆరడుగుల మేర నీరు ప్రవహిస్తుంది. దీంతో ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. గోదావరిలో నీరు మరింత పెరుగుతుండడంతో మరో వారం రోజుల వరకు కాజ్‌వే వరద ముంపులోనే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వరద పెరిగితే మిగిలిన లంక గ్రామాలు కూడా వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉన్నందున అధికారులందరూ విధులు నిర్వహణకు సిద్ధంగా ఉంచామని తహసీల్దార్ గ్రంథి నాగ వెంకట పవన్‌కుమార్ తెలిపారు. స్థానిక సిబ్బంది అప్రమతంగా ఉండాలన్నారు.