
ఈ విధానం సరికాదు
పూర్వం సంపన్న వర్గాలు సాయం, అప్పు రూపంలో డబ్బులిచ్చి అందుకు తగ్గట్టుగా పనిచేయించుకునే వారు. 1976లో కేంద్ర ప్రభుత్వం ఈ వెట్టిచాకిరీని రద్దుచేస్తూ చట్టం చేసింది. ప్రస్తుత పీ–4 గతాన్ని గుర్తుచేస్తోంది. పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకు నేరుగా అవసరమైన సాయం అందించాలే తప్ప ఈ విధానం సరికాదు.
– కామన బాల సత్యనారాయణ,
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, నరసాపురం
బాధ్యత గాలికొదిలేయడమే
ధనికులే బాధ్యత తీసుకుని పేదల్ని ఉద్ధరించింది ప్ర పంచంలో ఎక్కడా జరగలేదు. ప్రభుత్వం పేదల సంక్షేమం–బాధ్యత నుంచి వైదొలగాలనుకోవడం దారుణం. మరోవైపు పేదల సంక్షేమం బాధ్యత ధనవంతుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలనడం సరికాదు. ప్రజలపై పన్నుల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటున్న ప్రభుత్వాలు ప్రజల సంక్షేమ బాధ్యతను గాలికొదిలేయడం అన్యాయం.
– బి.బలరాం, సీపీఎం రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుడు
పారదర్శకంగా అందించాలి
అర్హులైన పేద, దిగువ మధ్యతరగతి వర్గాల వారందరికీ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు పారదర్శకంగా సంక్షేమాన్ని అందజేయాలి. అంతేకానీ పీ4 విధానంలో వ్యక్తిగత లబ్ధి అందిస్తానని అనడం కరెక్ట్ కాదు. ఇలాంటి విధానాలతో వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లే అవకాశం ఉంది.
– ఎస్‌వీ జాకబ్ బాబు,
ఎస్‌టీఎఫ్ పూర్వ జిల్లా కార్యదర్శి
●

ఈ విధానం సరికాదు

ఈ విధానం సరికాదు